Karnataka: దేశవ్యాప్తంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఆసక్తి కనబరిచారు. కాంగ్రెస్ గత మూడు దశాబ్ధాల్లో ఎప్పుడూ లేని విధంగా విజయం సాధించింది. ప్రజలంతా ఈ హడావుడిలో ఉండగా.. కర్ణాటకలో మాత్రం విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. ప్రతీ యూనిట్ కు 70 పైసల చొప్పున పెంచింది. ఈ రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయి. దశాబ్ధకాలంలో ఎప్పుడూ లేని విధంగా ఛార్జీలు పెరిగాయి. కర్ణాటక ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (కెఇఆర్‌సి) మే 12న 70 పైసల సుంకం పెంపునకు ఆమోదం తెలిపింది. 70 పైసలలో 57 పైసలు స్థిర ఛార్జీల ద్వారా రికవరీ చేయబడతాయి, మిగిలిన 13 పైసలు ఇంధన ఛార్జీలుగా రికవరీ చేయబడతాయి.
Read Also: Sunil Kanugolu : కర్ణాటక ఎన్నికల్లో పీకే శిష్యుడు సక్సెస్.. నెక్ట్స్ తెలంగాణే..?
రూ. 4,457.12 ఆదాయ వ్యత్యాసాన్ని తగ్గించడానికి కమీషన్ వినియోగదారుల సుంకాన్ని అన్ని విభాగాల్లో యూనిట్ కు సగటున 70 పైసలు పెంచడానికి ఆమోదం తెలిపింది. ఇది మొత్తం 8.31 శాతం పెరుగినట్లైనట్లు కేఈఆర్సీ తెలిపింది. విద్యుత్ సరఫరా సంస్థలు 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.8,951.20 కోట్ల రెవెన్యూ లోటును తగ్గించేందుకు యూనిట్‌కు రూ.1.39 పెంచాలని డిమాండ్ చేశాయి. విద్యుత్ కొనుగోలు వ్యయం 13 శాతం పెరగడం, బొగ్గు- రవాణా ఖర్చులు పెరగడం, ఉద్యోగుల వేతనాలు-భత్యాలను 20 శాతం సవరించడం వల్ల, వడ్డీ మరియు ఫైనాన్స్ ఛార్జీలలో 30 శాతం పెరుగుదల, 15 శాతం తరుగుదల కారణంగా ఈ సవరణ అవసరమని పేర్కొంది. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 136 స్థానాలను, బీజేపీ 64, జేడీయూ 20 స్థానాలను కైవసం చేసుకుంది.