ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ. జగన్ ఒక్క రోజు సీఎంగా ఉన్నా.. రాష్ట్రానికి శాపం.ఏయే శాఖల్లో ఎంత అప్పులు తెచ్చారు.. ఎంత ఖర్చు చేశారో వైట్ పేపర్ విడుదల చేయాలి.ఏపీ విద్యుత్ శాఖలో జరిగిన అన్ని రకాల అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలి.ఏపీలో దర్యాప్తు సంస్థలు ఏ చేస్తాయో అందరికీ తెలుసు.బాబాయ్ హత్య కేసు దర్యాప్తు ఏం చేశారో తెలిసిందే.. అందుకే సీబీఐ విచారణ కోరుతున్నాం.జగన్ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారు.జగన్ అవినీతి దాహం వల్లే విద్యుత్ ఛార్జీల భారం పడింది.విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి ఏపీ 22.5 మిలియన్ యూనిట్లలో లోటుతో ఉంది.2019 నాటికి మిగులు విద్యుత్ సాధించి జగనుకు చంద్రబాబు అప్పజెప్పారు.జగన్ ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. విద్యుత్ ఛార్జీల పెంచడం ద్వారా రూ. 17093 కోట్ల విద్యుత్ భారం పడింది.రూ. 34 వేల కోట్లకు పైగా డిస్కంలపై భారం పడింది.పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్, హిందూజాకు ఇవ్వాలని తెచ్చిన అప్పులు రూ.37 వేల కోట్లు.
విద్యుత్ కొనుగోళ్లల్లో కమిషన్ ద్వారా రూ. 6 వేల కోట్లు దండుకున్నారు.స్మార్ట్ మీటర్లు పెట్టే అంశంలో కూడా అవినీతి చోటు చేసుకుంది.స్మార్ట్ మీటర్ల అంశంలో కోట్లాది రూపాయలను దండుకుంటున్నారు.మహారాష్ట్రలో ఒక్కొ మీటరకు రూ. 18 వేలు ఖర్చు చేస్తోంటే.. ఏపీలో రూ. 30 వేలు ఖర్చు పెడుతున్నారు.మంత్రి పెద్దిరెడ్డి బినామీ కంపెనీలకు స్మార్ట్ మీటర్ల అంశాన్ని కట్టబెట్టారు.వివిధ శాఖల నుంచి లక్షల కోట్లు అప్పులు తెచ్చారు.భారీ ఎత్తున ఛార్జీలు పెంచారు.డీబీటీల ద్వారా రూ. 2 లక్షల కోట్లు పంపిణీ చేశామన్నారు.మరి మిగతా సొమ్ము ఏమైంది..? అని కన్నా ప్రశ్నించారు.
Read Also: Health Tips: మన ఆరోగ్యం మన చేతుల్లోనే.. ఈ తప్పులు చేయొద్దు!