ఏపీలో విద్యుత్ కష్టాలు జనానికి ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. పరిశ్రమలకు కూడా ఇక్కట్లు పాలవుతున్నాయి. ఈనేపథ్యంలో విద్యుత్ శాఖపై మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష నిర్వహించారు. విద్యుత్ పరిస్థితి.. అదనపు విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలపై చర్చించారు. అదనంగా మరో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలిచ్చారు. కృష్ణపట్నం, ఎన్టీటిపిఎస్సులల్లో 800 మెగావాట్ల విద్యుత్ యూనిట్లను వినియోగించుకోవాలని సూచన.హైడెల్ ప్లాంట్ల ద్వారా మరో 6000 మెగావాట్ల ఉత్పత్తికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు అధికారుల వెల్లడి.మే ఒకటి…
ఏపీలో విద్యుత్ కోతలు, పవర్ హాలిడే అంశాలపై సీఎం జగన్మోహన్ రెడ్డికి టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు. పవర్ హాలిడే ఎత్తేయాలని లోకేష్ కోరారు. పవర్‌లో వున్న మీరు పవర్ హాలీడే ప్రకటించడం చాలా సులువే. కానీ ఆ ప్రకటన చేసే ముందు కనీసం ఒక్క క్షణం రాష్ట్ర పరిస్థితి ఆలోచించారా? మొన్నటి వరకు కరోనా కష్టాలతో నష్టాల్లో నడిచిన పరిశ్రమలు ఇప్పుడిప్పుడే కాస్త గాడినపడి పుంజుకుంటుంటే పవర్ హాలిడే…
రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు, కరెంట్ కోతలకు నిరసనగా టీడీపీ నిరసనలు ఉధృతంగా సాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణం, నియోజకవర్గంలోని వివిధ మండలాలలో పలు గ్రామాల్లో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బాదుడే బాదుడు పేరుతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో పన్నులు నిత్యావసర ధరల పెంపుపై టీడీపీ విన్యూత్నరీతిలో నిరసనలు చేపట్టింది. పాలకొల్లు నియోజకవర్గంలో పెంచిన పన్నులు, నిత్యావసర ధరల పెంపుపై ఈ ప్రభుత్వం బాదుడే బాదుడును ఇంటింటికీ కార్యక్రమం…
వరుసగా పెరుగుతున్న నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సిలిండర్ల బాదుడుతో సామాన్యులు నానా అవస్థలు పడుతున్నారు. తెలంగాణలో ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు విపరీతంగా పెంచారు. చంద్రబాబు హయాంలో ఛార్జీల పెంపుపై పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. చంద్రబాబు అధికారం కోల్పోయారు. ఇపుడు ధరలు తగ్గించక పోతే, ఆందోళనలు చేస్తాం అన్నారు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం. వరి కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్రాలు బాధ్యత తీసుకోవాలన్నారు. కేసీఆర్ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడడాన్ని స్వాగతిస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాల…
తెలంగాణలో ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న ఆర్టీసీని, అప్పుల్లో కూరుకుపోయిన డిస్కంలను ఆదుకునేందుకు ప్రజలపై భారం మోపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బ్యాంకులు తీసుకున్న అప్పులను ఆర్టీసీ తీర్చలేక అష్టకష్టాలు పడుతోంది. ఈ నేపథ్యంలో ఛార్జీలు పెంచుకునేందుకు ఈ రెండు సంస్థలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చేవారంలో ప్రభుత్వం ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రకటన చేసే అవకాశం ఉంది. Read Also:…
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం విద్యుత్ బిల్లులు అమాంతం పెంచి సంక్షేమ పథకాల్లో కోత విధిస్తూ పేద ప్రజలను మోసం చేస్తున్నారని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపించారు. గురువారం కోవెలకుంట్ల మండలం లోని కలుగొట్ల గ్రామంలో ఆయన పర్యటించి విద్యుత్ సమస్య కరెంట్ ఛార్జీల పెరుగుదలతో ప్రజలను ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం అని చెబుతూ విద్యుత్ బిల్లులు పెంచి సంక్షేమ పథకాల్లో…
కరోనా కష్టకాలంలో ప్రజలపై మరో పిడుగును వేసేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమవుతోంది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను సాకుగా చూపుతూ ఆర్టీసీ ఛార్జీలను.. డిస్కం నష్టాలను చూపుతూ విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు కేసీఆర్ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. కరోనాతో ఇప్పటికే ప్రజలంతా ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతుంటే పులిమీద పుట్రలా మరో భారాన్ని మోపడానికి ప్రభుత్వం సిద్ధమవుతుండటం శోచనీయంగా మారింది. ఈ పెంపు త్వరలోనే అమల్లోకి రానుందని తెలుస్తోంది. కరోనా మహమ్మరి దెబ్బకు అన్నిరంగాల మాదిరిగానే ఆర్టీసీ సైతం కుదేలైంది.…