తెలంగాణలో మరోసారి విద్యుత్ చార్జీల మోత మోగనుందా? అంటే ఏమో అది జరిగినా ఆశ్చర్యం మాత్రం లేదు.. ఎందుకంటే.. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను తెలంగాణ ఈఆర్సీ ఛైర్మెన్ శ్రీరంగ రావుకు సమర్పించాయి డిస్కంలు.. ఇక, తనకు అందిన ప్రతిపాదలనపై తెలంగాణ ఈఆర్సీ ఛైర్మెన్ శ్రీరంగరావు మాట్లాడుతూ.. ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్ విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు ఈఆర్సీకి అందించాయి.. ఈ వివరాలన్నీ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో పెడతాం అన్నారు.. డిస్కమ్స్ ప్రతిపాదనలపై బహిరంగ ద్వారా అభిప్రాయాలు తీసుకుంటాం.. పబ్లిక్ సమావేశాల తర్వాత ఛార్జీలు పెంచాలా? తగ్గించాలా? అనేది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.. ఇక, 500 యూనిట్లు వినియోగించే వినియోగదరులకు ప్రీ పెయిడ్ మీటర్స్ పెట్టుకోవాలని డిస్కంలు సూచించాయన్న ఆయన.. యూనిట్‌కు 30 పైసలు డిస్కంలు పెంచుకునే వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం కల్పించిందని తెలిపారు.. ఇప్పటి వరకు డిస్కంలు వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్నాయని.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం డిస్కంలకు ఇచ్చే నిధులను సకాలంలో అందజేస్తాయని వారి భావిస్తున్నట్టు తెలిపారు..
ఇక, రెండు డిస్కంలు రూ.1,0535 కోట్ల రెవెన్యూ లోటులో ఉన్నాయన తెలిపారు శ్రీరంగరావు.. 2023 – 24 సంవత్సరానికి ఎస్పీడీసీఎల్ రూ.36,963 కోట్లు, రూ. 17,095 కోట్ల రెవెన్యూ వస్తుందని భావిస్తున్నాం.. 2023 -24 సంవత్సరానికి రూ.54,060 కోట్ల రెవెన్యూను డిస్కంలు ఆశిస్తున్నాయని.. 10316 మిలియన్ యూనిట్ల లోటులో డిస్కంలు ఉన్నన్నాయని పేర్కొన్నారు తెలంగాణ ఈఆర్సీ ఛైర్మెన్ శ్రీరంగ రావు.. కాగా, తెలంగాణలో ఈ మధ్యే విద్యుత్ చార్జీలు పెరిగాయి.. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి పచ్చజెండా ఊపడంతో.. విద్యుత్ ఛార్జీలను 14 శాతం పెంచేందుకు టీఎస్ ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డొమెస్టిక్ విద్యుత్ యూనిట్పై 40 నుంచి 50 పైసలు పెంచారు. ఇక ఇతర కేటగిరీలపై యూనిట్‌కు రూపాయి పెంచారు. ఛార్జీలను 19 శాతం పెంచుకునేందుకు వీలు కల్పించాలని ఈఆర్సీకి విజ్ఞప్తి చేశాయి. అయితే ఛార్జీలను 14 శాతం మేర పెంచుకునేందుకు ఈఆర్సీ అంగీకరించింది. దాదాపు ఏడేళ్ల తర్వాత విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు ఇచ్చాయి. చార్జీల పెంపుతో డిస్కంలకు రూ 6,831 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని.. అంచనా వేశారు.. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పెంచిన చార్జీలు అమల్లోకి వచ్చాయి.. మరోవైపు ట్రాన్స్‌కో ఈఆర్సీకి సమర్పించిన టారిఫ్‌ల్లో రూ.9,128.57 కోట్ల లోటు ఉందని గతంలో వెల్లడించారు.. ఛార్జీల పెంపు తర్వాత లోటు రూ.2686.79 కోట్లు ఉంటుందని అంచనా వేసిన విషయం విదితమే కాగా.. మరోసారి డిస్కంలు.. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనను తెలంగాణ ఈఆర్సీ ముందు పెట్టారు.. మరి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.