సినీ రచయిత నటుడు పలు సినిమాల్లో హీరోగా కూడా నటించిన పోసాని కృష్ణ మురళి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లుగా ఆయన సంచలన ప్రకటన చేశారు. ఇక మీదట నుంచి తాను రాజకీయాల గురించి మాట్లాడనని, ఏ పార్టీని పొగడను ఏ పార్టీ గురించి మాట్లాడను, మరే పార్టీని విమర్శించను అంటూ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. నన్ను ఎవరూ ఏమీ అనలేదని పేర్కొన్న ఆయన ఎవరి గురించి ఇక నుంచి మాట్లాడను అని పేర్కొనడం గమనార్హం. నిజానికి పోసాని కృష్ణ మురళి మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఆ పార్టీ తరఫున గుంటూరు జిల్లా నుంచి ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు.
President Droupadi Murmu: హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన వైఎస్ జగన్ వెంట నడిచి తెలుగుదేశం పార్టీని, జనసేనను టార్గెట్ చేస్తూ వచ్చారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద పోసాని కృష్ణ మురళి విమర్శలు హద్దు దాటాయనే వాదన కూడా తెరమీదకు వచ్చింది. ఇక ఇప్పుడు పోసాని కృష్ణ మురళి మీద ఏపీ వ్యాప్తంగా అనేక చోట్ల తెలుగుదేశం మద్దతుదారులు కేసులు పెడుతున్నారు. ఇక ఈ విషయం మీద గత కొద్దిరోజులుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాను రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు పోసాని కృష్ణ మురళి ప్రకటించడం హాట్ టాపిక్ అవుతుంది.