సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి జైలు నుంచి బయటకు రావడంపై సందిగ్ధం నెలకొంది. కోర్ట్ బెయిల్ ఇచ్చినా.. బయటకు రావడం డౌటేనన్న అనుమానాలు నెలకొన్నాయి. పోసానిపై గుంటూరు సీఐడీ పోలీసులు పీటీ వారెంట్ వేశారు. ఆయన కోసం గుంటూరు సీఐడీ పోలీసులు కర్నూలు జిల్లా జైలుకు వెళ్లారు. పీటీ వారెంట్‌పై పోసానిని కోర్టు గుంటూరు కోర్టు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. జైలు నుంచే వర్చువల్‌గా జడ్జి ఎదుట పోసానిని ప్రవేశపెట్టనున్నారు. పోసాని కృష్ణమురళిపై నమోదైన…
సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని పీటీ వారెంట్‌పై నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో పోసానిని నరసరావుపేటకు తీసుకెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు పోసానిని నరసరావుపేట తీసుకువచ్చే అవకాశం ఉంది. నరసరావుపేట పోలీసులకు అప్పగించే ముందు పోసానికి జైలు అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. నరసరావుపేట టూ టౌన్ పీఎస్‌లో 153, 504, 67 సెక్షన్ల కింద పోసానిపై కేసు నమోదు చేశారు. అంతకుముందు రాజంపేట సబ్ జైల్ వద్ద ఉత్కంఠ నెలకొంది. గత…
సినీ నటుడు పోసాని కృష్ణమురళికి తృటిలో ప్రమాదం తప్పింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ వద్ద జీపు దిగి లోపలికి వెళుతూ ఉండగా.. అకస్మాత్తుగా డ్రైవర్ జీపును ముందుకు కదిలించాడు. జీపు తగిలి పోసాని త్రూలి పడబోయారు. పక్కనే ఉన్న పోలీసులు ఆయనను పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. పోసాని సహా పోలీసు అధికారులు డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన అనంతరం పోసాని ఓబులవారిపల్లె పీఎస్‌లోకి వెళ్లిపోయారు. ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లోనే ప్రభుత్వ వైద్యుడు…
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు విని ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపాను అని జనసేన రాయలసీమ జోన్ కన్వీనర్ జోగిమణి తెలిపారు. తమ నాయకుని కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతూ ఉంటే.. తాము కూడా మాట్లాడాలి అనుకున్నాం కానీ పవన్ వద్దని సూచించారని చెప్పారు. సంస్కారం అడ్డువచ్చే తాము అలా మాట్లాడలేదని, పోసాని ప్రవర్తన సరిగా లేకనే ఫిర్యాదు చేయాల్సి వచ్చిందన్నారు. పోసానిపై గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఫిర్యాదులు చేసినా..…