Posani Krishna Murali: ఏపీ వ్యాప్తంగా 17 కేసులు.. ముందు మాకే అప్పగించాలంటూ పీటీ వారెంట్‌లు!
- నరసరావుపేట పోలీసుల అదుపులో పోసాని
- ఏపీ వ్యాప్తంగా మొత్తం 17 కేసులు
- రాజంపేట సబ్ జైల్ వద్ద ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని పీటీ వారెంట్‌పై నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో పోసానిని నరసరావుపేటకు తీసుకెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు పోసానిని నరసరావుపేట తీసుకువచ్చే అవకాశం ఉంది. నరసరావుపేట పోలీసులకు అప్పగించే ముందు పోసానికి జైలు అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. నరసరావుపేట టూ టౌన్ పీఎస్‌లో 153, 504, 67 సెక్షన్ల కింద పోసానిపై కేసు నమోదు చేశారు.
అంతకుముందు రాజంపేట సబ్ జైల్ వద్ద ఉత్కంఠ నెలకొంది. గత నాలుగు రోజులుగా రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కృష్ణమురళిని పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకోవడానికి 3 జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు వచ్చారు. నరసరావుపేట, అల్లూరి జిల్లా, అనంతపురం గ్రామీణ పోలీసులు రాజంపేట జైలు అధికారికి పీటీ వారెంట్లు ఇచ్చారు. తాము కోర్టు అనుమతి తీసుకున్నాం అని, ముందుగా తమకే పోసానిని అప్పగించాలని నరసరావుపేట పోలీసులు రాజంపేట జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎవరికి అప్పగించాలనే విషయంపై జైలు అధికారులు ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఇందుకు సంబంధించిన నిబంధనలు కూడా పరిశీలించారు. ఉన్నతాధికారుల అనుమతితో నరసరావుపేట పోలీసులకు పోసానిని అప్పగించారు.
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
తనకు మరోసారి ఛాతీలో నొప్పి వచ్చిందని ఉదయం పోసాని కృష్ణమురళి జైలు అధికారులకు తెలియజేసినట్లు సమాచారం. రాజంపేట ప్రభుత్వ వైద్యులు జైలు లోపలికి వెళ్లి పోసానిని పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నారా లోకేష్ సహా వారి కుటుంబాలపై సోషల్ మీడియా వేదికగా చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో పోసాని అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఏపీ వ్యాప్తంగా మొత్తం 17 కేసులు నమోదయ్యాయి. 17 పోలీసు స్టేషన్లకు సంబంధించిన పోలీసులు కూడా పీటీ వారెంట్లు సిద్ధం చేస్తున్నారు.
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!