Poonch attack: జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలో నిన్న భారత వైమానిక దళం ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఒకరు మరణించగా, నలుగురు గాయపడ్డారు.
Poonch attack: జమ్మూ కాశ్మీర్ పూంచ్‌లో గురువారం జరిగిన ఉగ్రవాద దాడిలో ఐదుగురు జవాన్లు మరణించారు. పక్కా ప్లాన్ ప్రకారం ఎత్తైన ప్రాంతం నుంచి ఆర్మీ వాహనాలపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనకు పాక్ ఆధారిత లష్కరే తోయిబా ఉగ్రసంస్థకి చెందిన పీఏఎఫ్ఎఫ్ పనిగా బాధ్యత ప్రకటించింది. అయితే ఈ దాడి వెనక దాయాది దేశం పాకిస్తాన్‌తో పాటు దాని ఆప్తమిత్ర దేశం చైనా ఉన్నట్లుగా నిఘావర్గాలు తెలుపాయి.
జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్‌లో ఆర్మీ ట్రక్కుపై మెరుపుదాడి చేసిన ఉగ్రవాదులు సాయుధ కవచాన్ని చీల్చగల ఉక్కు బుల్లెట్లను ఉపయోగించినట్లు తెలిసింది. గురువారం మధ్యాహ్నం భటా ధురియన్ దట్టమైన అటవీ ప్రాంతంలో సమీపంలోని గ్రామానికి ఇఫ్తార్ కోసం తినుబండారాలు తీసుకెళ్తున్న ఒంటరి ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఐదుగురు సైనికులు మరణించగా.. ఒకరు గాయపడ్డారు.
గురువారం జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌లో ఐదుగురు సైనికులను చంపిన ఉగ్రదాడి 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర కావచ్చునని ఆర్జేడీ ఎమ్మెల్యే భాయ్ వీరేంద్ర పేర్కొన్నారు.
Poonch Attack: భారతదేశంపై పాకిస్తాన్ తన కుట్రలను అమలు చేయడం ఆపడం లేదు. తినడానికి తిండి లేకున్నా కూడా పాకిస్తాన్ భారత్ పై తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉంది. భారత్ దినదినం అభివృద్ధి చెందుతుంటే, ఉగ్రవాద దేశంగా ముద్రపడిన పాకిస్తాన్ మాత్రం రోజురోజుకు ఆర్థిక, రాజకీయ సమస్యలతో పాతాళంలోకి కూరుకుపోతోంది. ఇంత జరుగుతున్నా కూడా భారత్ అంటే అదే ద్వేషం, అదే అక్కసు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకాశ్మీర్ విభజన, అక్కడ శాంతిభద్రతల…
Poonch Attack: జమ్మూకాశ్మీర పూంచ్ జిల్లాలో గురువారం భీంజెర్ గలి నుంచి సాంగియోట్ కు వెళ్తున్న ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో పాటు గ్రెనెడ్స్ తో దాడి చేశారు. ఈ ఘటనలో భారత సైన్యానికి చెందిన ఐదుగురు మరణించారు. ఒకరు గాయపడ్డారు. ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు వేట సాగిస్తున్నాయి. సైన్యంతో పాటు ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది.