గుజరాత్‌లోని బోర్తలావ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈరోజు మధ్యాహ్నం ఆరుగురు చిన్నారులు నీటిలో మునిగిపోయారు. ఈ ప్రమాదంలో ఐదుగురు బాలికలు, ఒక బాలుడు ఉన్నారు. పిల్లలంతా స్థానిక ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. అయితే.. బట్టలు ఉతకడం కోసమని.. స్నానానికి చెరువుకు వెళ్లారు. ఈ క్రమంలో చెరువులోకి దిగడంతో చిన్నారులు నీటిలో మునిగి పోయారు.
ఆ తల్లి నవమాసాలు బిడ్డను కడుపులో మోసింది. పురుటి నొప్పులను భరించి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ ముక్కుపచ్చలారని పసికందు పుట్టిన కాసేపటికే చెరువులో విగతజీవిగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి సమీపంలోని చెరువులో పురిటి బిడ్డ మృతదేహం లభ్యమైంది.
సెలవు రోజులు జలగండాలవుతున్నాయి. సరదాతో కొందరు, ప్రమాదవశాత్తు మరికొందరు మృత్యువాత పడుతున్న ఘటనలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. తాజాగా ఆదివారం రోజున ఇద్దరు అన్నదమ్ములు చెరువులో ఈతకు వెళ్లి మృతి చెందిన విషాద ఘటన చిత్తూరు జిల్లా సదుంలో చోటుచేసుకుంది.
బీహార్‌లోని కైమూర్‌లో తీవ్ర విషాదం నెలకొంది. చెరువులో స్నానానికి దిగి ఐదుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారిలో నలుగురు అబ్బాయిలు ఉండగా.. ఒక అమ్మాయి ఉంది. స్థానికులు చెరువులో నుంచి మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనతో చిన్నారుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఘటనాస్థలానికి చేరుకున్న చిన్నారుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా దు:ఖ సాగరంలో నిండిపోయింది.
చెరువులో మునిగి ముగ్గురు బాలికలు మృతి చెందిన ఘటన బీహార్లో చోటు చేసుకుంది. బరాహత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బభంగమా గ్రామంలో గురువారం మధ్యాహ్నం చెరువులో మునిగి ముగ్గురు బాలికలు చనిపోయారు. స్నానానికి చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు.
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగయ్యపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. రంగయ్యపల్లిలోని చెరువులో నలుగురు గల్లంతు అయ్యారు. చెరువులో స్నానానికి వెళ్లిన బాలుడు గల్లంతు కాగా.. అతడిని కాపాడేందుకు ఒక మహిళ ప్రయత్నించింది.. ఈ క్రమంలోనే సదరు మహిళ గల్లంతైంది.. ఇక, మరో ఇద్దరు మహిళలు కూడా వారిని కాపాడేందుకు ప్రయత్నించి చెరువులో గల్లంతు అయ్యారు.
చెరువులో పడి ఇద్దరు బాలికలు మృతి చెందిన ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. ఈ ఘటన డొమినియా ఖండలో జరిగింది. తీజ్ సందర్భంగా విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు వెళ్లిన ఐదుగురు బాలికలు చెరువులోకి వెళ్లారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు మరణించగా.. ముగ్గురు బాలికలు ప్రాణాలతో బయటపడ్డారు.
బీహార్‌లోని పూర్ణియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు.. నీటి గుంతలో పడిపోయింది. దీంతో కారులో ఉన్న ఎనిమిది మంది అక్కడిక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో కారును వెలికి తీశారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. బాధితులంగా కిశన్‌గంజ్‌లోని నునియా గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. శుక్రవారం రాత్రి తారాబడి ప్రాంతంలో జరిగిన ప్రీ వెడ్డింగ్ పార్టీకి హాజరయ్యారని, కారులో ఇంటికి తిరిగి వెళ్తుండగా…
మగాళ్ళు మృగాళ్ళుగా మారుతున్నారు. చెన్నైలో రెండురోజుల క్రితం భార్య పిల్లల్ని రంపంతో కోసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ దారుణ ఘటన నుంచి తేరుకోకముందే మరో ఘటన విభ్రాంతిని కలిగించింది. తిరుపతిలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చేసిన ఘాతుకం సభ్య సమాజాన్ని నివ్వెరపోయేలా చేస్తోంది. ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ భార్యను దారుణంగా కొట్టి చంపి చెరువులో పడేశాడు. ఇదేం లేటెస్ట్ కాదు. ఈ ఘటన జరిగి చాలా కాలం అయింది. ఐదు నెలల తరువాత…