గుజరాత్‌లోని బోర్తలావ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈరోజు మధ్యాహ్నం ఆరుగురు చిన్నారులు నీటిలో మునిగిపోయారు. ఈ ప్రమాదంలో ఐదుగురు బాలికలు, ఒక బాలుడు ఉన్నారు. పిల్లలంతా స్థానిక ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. అయితే.. బట్టలు ఉతకడం కోసమని.. స్నానానికి చెరువుకు వెళ్లారు. ఈ క్రమంలో చెరువులోకి దిగడంతో చిన్నారులు నీటిలో మునిగి పోయారు.
Read Also: Singapore Airlines: విమానంలో తీవ్రమైన అలజడి.. ఒకరి మృతి
కాగా.. పిల్లలు నీట మునిగిపోవడం గమనించిన స్థానికులు ఐదుగురు బాలికలను చెరువులో నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అయితే.. వీరిలో నలుగురు బాలికలు మృతి చెందినట్లు అక్కడి మీడియా తెలిపింది. మరోవైపు.. నీట మునిగిన వారిలో మరో బాలుడు ఆచూకీ లభించలేదు. దీంతో.. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని నీటిలో మునిగిన బాలుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Read Also: Rajasthan: ఇంట్లో సమస్యలు ఉన్నాయని వెళ్తే.. ఆస్తి కాజేసిన తాంత్రికుడు
ఇదిలా ఉంటే.. కొన్ని రోజుల క్రితం నర్మదాలో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు. ఈ విషాద ఘటన నుండి స్థానిక ప్రజలు ఇంకా తేరుకోక ముందే.. ఈ రోజు మరో ప్రమాదం చోటు చేసుకుంది.