Congress : ఆ సీనియర్ నేత ముందు జూనియర్స్ కుప్పి గంతులు వేస్తున్నారా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వి. హన్మంతరావు. తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడు. ఆయన నియోజకవర్గం అంబర్‌పేటలో అడుగు పెట్టాలంటే పార్టీ నేతలు హడలిపోతారు. పేరుకు సీనియరైనా.. నియోజకవర్గాన్ని VH అంతగా పట్టించుకోవడం లేదనే విమర్శ కాంగ్రెస్ వర్గాల్లోనే ఉందట. ఎన్నికల్లో VH పోటీ చేసే పరిస్థితి లేదన్నది కొందరి వాదన. అలాగని అంబర్‌పేట కాంగ్రెస్‌లో బలమైనే నేతనూ తయారు చేయడం లేదట. 2018 ఎన్నికల్లో పొత్తులో బాగంగా.. అంబర్‌పేటను కోదండరాం పార్టీ తెలంగాణ జనసమితికి కేటాయించారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల కోసం నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన జూనియర్ నేతలు హడావిడి మొదలు పెట్టేశారు.
ఏకంగా నలుగురు కాంగ్రెస్ యువనేతలు పార్టీ టికెట్ కోసం గట్టి ఫోకస్సే పెట్టారట. హన్మంతరావు మనసులో ఏముందో వెల్లడి కాకపోయినా.. సత్తా చాటితే అంబర్‌పేట టికెట్ తమకే వస్తుందని లెక్కలేస్తున్నారట ఆ యువనేతలు. వారిలో కాంగ్రెస్ OBC సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నూతి శ్రీకాంత్ ఒకరు. కాకపోతే VHతో శ్రీకాంత్‌కు గ్యాప్ ఉంది. VHపై దాడి ఘటనలో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుల వరకు వెళ్లింది రగడ. తనకు చెప్పకుండా అంబర్‌పేటలో మరో నేతను ఎంకరైజ్ చేయడం ఏంటనే లొల్లి జరిగింది. అందుకే 2018లో అంబర్‌పేట సీటును TJSకు ఇచ్చేశారు.
Also Read
అంబర్ పేటలో తనకు సన్నిహితంగా ఉండే శ్రీకాంత్‌గౌడ్‌ను VH ప్రోత్సహిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో శ్రీకాంత్‌గౌడ్ సతీమణికి టికెట్ ఇప్పించారు కూడా. కానీ.. ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. అదేమైనా మైనస్ అవుతుందా అనే అనుమానాలు ఉన్నాయట. ఇదే సమయంలో సిటీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మోత రోహిత్ కూడా కూడా అంబర్‌పేటపై కన్నేసినట్టు తెలుస్తోంది. ఇక్కడ యూత్ కాంగ్రెస్ యాక్టివిటీస్‌ను ఆయన పెంచుతున్నారు. కాంగ్రెస్‌కే చెందిన మరో నేత శ్రీనివాస యాదవ్ సైతం పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. ఆయన పీసీసీ కార్యదర్శిగా ఉన్నారు. VHతో సన్నిహితంగా ఉంటున్నారు కూడా. OBC విభాగంలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి అనుకూల టీమ్ లేదు. ఆ కోణంలో రేవంత్‌కు దగ్గరయ్యే పనిలో ఉన్నారట శ్రీనివాసయాదవ్. ఈ విధంగా కాంగ్రెస్‌లో ఎవరికి వారు తమదే సీటు అనే ధీమాతో పావులు కదిపేస్తున్నారు. అయితే టికెట్ కేటాయింపునకు వచ్చే సరికి VH ఆశీసులు ఎవరికి అన్నదే పార్టీలో ప్రశ్న.
అంబర్‌పేటలో కాంగ్రెస్ యువనేతల హడావిడి చూశాక.. హన్మంతుడి ముందు కుప్పిగంతులు వేస్తున్నారని గాంధీభవన్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. VH కూడా అన్నీ గమనిస్తున్నారట. మరి.. అంబర్‌పేట కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలపై సమయం వచ్చినప్పుడు హన్మంతరావు స్పందిస్తారో లేక తనదైన శైలిలో గిట్టని వారికి తలంటేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!