Karnataka: కర్ణాటక చిత్తాపూర్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ర్యాలీకి అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపై రాజకీయ వివాదం రాజుకుంది. శాంతిభద్రతల సమస్యను పేర్కొంటూ అధికారులు అనుమతికి నిరాకరించారు. ఆర్ఎస్ఎస్‌కు చెందిన వ్యక్తి, సంస్థ శతాబ్ది ఉత్సవాలకు, విజయదశమి ఉత్సవం కోసం పట్టణంలో చిన్న స్థాయి ఊరేగింపు నిర్వహించడానికి అనుమతి కోరారు. దీనికి పోలీసుల నుంచి నిరాకరణ ఎదురైంది. ఆదివారం ఆర్ఎస్ఎస్ మార్చ్‌కు అనుమతి కోరిన అదే మార్గంలో భీమ్ ఆర్మీ,భారతీయ దళిత్ పాంథర్ (R)…
Tadipatri: గత కొన్ని రోజులుగా తాడిపత్రి నగరం రాజకీయ కక్షల నేపథ్యంలో అట్టుడుకుతోంది. ఓవైపు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మరోవైపు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు తాడిపత్రిలో రాజకీయ వాతావరణాన్ని మరింత పెంచుతున్నారు. ఇదివరకు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రిలోకి రావడానికి కూడా అనుమతి ఇచ్చింది. కానీ, ఆ సమయంలో కూడా తాడపత్రి నగరంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తాజాగా ఆక్రమణలు జరిగాయని మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేసింది తాడిపత్రి మున్సిపల్…
2024 అసెంబ్లీ ఎన్నికల్లో... ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మొత్తం 14 స్థానాలకు గాను 12 చోట్ల గెలిచింది కూటమి. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో గతంలో ఎప్పుడూ ఈ స్థాయి విజయం దక్కలేదు. అయినాసరే... ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు జిల్లా టీడీపీ ద్వితీయ శ్రేణికి మింగుడు పడటం లేదట. తోతాపురి మామిడికి గిట్టుబాటు ధర విషయంలో అంత రచ్చ జరుగుతున్నా.
హెచ్సీయూ భూములను పరిశీలించేందుకు బీజేపీ నేతలు బయల్దేరారు. భూముల వద్ద వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్లేందుకు యత్నించారు.. ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందు భారీగా పోలీసులు మోహరించారు. దీంతో బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. బీజేపీఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి హౌజ్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, దన్ పాల్ సూర్యనారాయణ గుప్త, బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద భారీగా పోలీసులు…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మొన్న ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేస్తూ.. గత ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లు అప్పు చేసినట్లు నాకు తెలియదు అన్నాడని కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్నో సభల్లో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అప్పులపై మాట్లాడిన వీడియోలు ఉన్నాయి.. రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు చెబుతున్నాడని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎంపికపై టీడీపీ కసరత్తు కొనసాగిస్తోంది. మరోవైపు ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. కొంతమందికి ప్రత్యేకంగా ఫోన్ చేసి పరిస్థితి వివరించినట్టు సమాచారం. ఖరారైన అభ్యర్థుల వివరాలు సాయంత్రం లోగా రానున్నాయి. నామినేషన్ కు రెడీ గా ఉండాలని పిలుపు నిచ్చారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు తీవ్ర ఉత్కంఠ రేకిత్తిస్తోంది.
MLC Elections : టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఖమ్మం నగరంలోని రికాబ్ బజార్ పాఠశాల పోలింగ్ బూత్ వద్ద ఉదయం నుంచి ఉద్రిక్తత పరిస్థితి కొనసాగుతుంది. మధ్యాహ్నం సమయంలో బీజేపీకి చెందిన నాయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పోలీసు వాహనం ముందు బీజేపీ క్యాడర్ బైఠాయించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది . పోలింగ్ బూత్ ముందు ఏర్పాటు చేసుకున్న బీజేపీ, యూటీఎఫ్, పీఆర్‌టీయూకు సంబంధించిన డెస్కుల వద్ద ప్లెక్సీ విషయంలో వివాదం కొనసాగుతుంది. ఉదయం…
Delhi : నేడి నుంచి రాజధాని ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు షురూ కానున్నాయి. 27 సంవత్సరాల తర్వాత బీజేపీ అధికార పార్టీలో, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్షంలో కూర్చోనుంది.
MLA House Arrest: హైదరాబాద్ లోని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్బంగా ఆయన హౌసింగ్ బోర్డ్ వేలంపై నిరసన వ్యక్తం చేస్తూ మండిపడ్డారు. హౌసింగ్ బోర్డ్ ఇప్పటికే 24 ఫ్లాట్లను వేలం వేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో రెండు ప్లాట్లు 2008 సంవత్సరంలో హెచ్ఎండిఏ 200 ఫీట్ల రోడ్డుగా నిర్ధారించారని తెలిపారు. కానీ, ఇప్పుడు హౌసింగ్ బోర్డ్ అధికారులు ఆ రోడ్డును 80 ఫీట్ల రోడ్డుగా చూపించి, వేలం…
కడప జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగలనుంది. కడప కార్పొరేషన్‌లో ఏడు మంది కార్పొరేటర్లు పార్టీ మారనున్నట్లు తెలిసింది. సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో కార్పొరేటర్లు టీడీపీలో చేరనున్నారు.