MLC Elections : టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఖమ్మం నగరంలోని రికాబ్ బజార్ పాఠశాల పోలింగ్ బూత్ వద్ద ఉదయం నుంచి ఉద్రిక్తత పరిస్థితి కొనసాగుతుంది. మధ్యాహ్నం సమయంలో బీజేపీకి చెందిన నాయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పోలీసు వాహనం ముందు బీజేపీ క్యాడర్ బైఠాయించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది . పోలింగ్ బూత్ ముందు ఏర్పాటు చేసుకున్న బీజేపీ, యూటీఎఫ్, పీఆర్‌టీయూకు సంబంధించిన డెస్కుల వద్ద ప్లెక్సీ విషయంలో వివాదం కొనసాగుతుంది. ఉదయం ఫ్లెక్సీ విషయంలో వివాదం కొనసాగగా ఉద్రక్తత పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత కొద్దిసేపటికి యూటీఎఫ్, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం చెలరేగింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. పోలీసులు, క్యాడర్ తోపులాట లో టెంట్ లు క్రింద పడ్డాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని వాహనం ఎక్కించగా వాహనం ముందు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ తో పాటు క్యాడర్ అడ్డుకున్నారు. వాహనం ముందు బీజేపీ క్యాడర్ బైఠాయించారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. చివరికి బీజేపీ నాయకుడిని వదిలిపెట్టడంతో బీజేపీ క్యాడర్ కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొని వచ్చారు.
Posani Krishna Murali: పోసానికి తృటిలో తప్పిన ప్రమాదం!