ఏపీలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కుప్పంలో వాతావరణం పొలిటికల్‌గా హాట్‌హాట్‌గా కనిపిస్తోంది. చంద్రబాబు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో పాగా వేయాలని అధికార పార్టీ వైసీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. దీంతో అధికార, విపక్షాల మధ్య పొలిటికల్ వార్ జరుగుతోంది. కుప్పంలో ఓటు అడిగే నైతిక హక్కు వైసీపీకి లేదని ఇప్పటికే నారా లోకేష్ విమర్శలు చేశారు. దీంతో వైసీపీ నేతలు లోకేష్‌కు వరుసగా కౌంటర్ ఇస్తున్నారు. లోకేష్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శల దాడి చేశారు. తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కూడా లోకేష్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
Read Also: దక్షిణాది సీఎంల భేటీకి తిరుపతి రెడీ
కుప్పంలో చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని మంత్రి బాలినేని ఎద్దేవా చేశారు. అక్కడ ఎలాగైనా గెలవాలని ఓటుకు రూ.5వేలు పంచుతున్నారని.. లోకేష్‌కు ఇది సిగ్గుచేటు అని విమర్శించారు. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా కుప్పంలో వైసీపీ ప్రభంజనం కొనసాగుతుందని.. ఇది తథ్యమని మంత్రి బాలినేని స్పష్టం చేశారు. సొంత నియోజకవర్గానికి ఏం చేయలేని చంద్రబాబు.. రాష్ట్రానికి ఏం చేస్తారని ప్రశ్నించారు. కుప్పం మున్సిపాలిటీని అభివృద్ధి చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని బాలినేని పేర్కొన్నారు.