టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ కవిత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం నాడు ఆమె ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు నామినేషన్ దాఖలుకు ఆఖరి రోజు కావడంతో మంగళవారం మధ్యాహ్నం 1:45 గంటలకు ముహూర్తం చూసుకుని కవిత తన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి సమర్పించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌లతో కలిసి కవిత నామినేషన్ దాఖలు చేశారు. Read…
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి విమర్శలు చేశారు. కేసీఆర్ తెలంగాణలో దీక్ష చేస్తే ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందని టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ దీక్ష చేసింది తెలంగాణ రైతుల కోసమా? పంజాబ్ రైతుల కోసమా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ రైస్ మిల్లర్ల కోసం ఆలోచిస్తున్నాడని.. తాము రైతుల కోసం ఆలోచిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. Read Also:…
ఏపీ అసెంబ్లీ ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, నందమూరి అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబుపై పలు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లో జరిగింది నాటకంతో కూడినటువంటి వ్యవహారమని, అసెంబ్లీలో జరిగింది వేరు బయట జరుగుతున్న ప్రచారం వేరని ఆయన అన్నారు. భువనేశ్వరిని ఎవరు ఏమి అనలేదని, చంద్రబాబు ఎక్కువ ప్రచారం చేసుకుంటున్నారన్నారు. చంద్రబాబు తన సతీమణిని అనవసరంగా రాజకీయాల్లోకి లాగుతున్నారని, హెరాయిన్ కేసు లో నా…
ఏపీలో వరద పరిస్థితులపై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. రాయలసీమను వరదలు ముంచెత్తాయని… భారీ వర్షాలకు కడప జిల్లాలో 30 మంది గల్లంతయ్యారని, 12 మంది చనిపోయారని లోకేష్ తెలిపారు. వరదలతో ప్రజలు అల్లాడిపోతుంటే ఏం జరిగిందో కనుక్కునే తీరిక లేని సీఎం జగన్‌ను ఏమనాలని లోకేష్ ప్రశ్నించారు. వరదలతో ప్రజలు కొట్టుకుపోతుంటే.. ఏరియల్ సర్వే పేరుతో సీఎం జగన్ గాల్లో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్ గాల్లో నుంచి…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మాజీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని వైసీపీ నేతలు దూషించారని వస్తున్న ఆరోపణలను మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఖండించారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక తీవ్ర అసహనంతో ఇలాంటి అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారని బాలినేని ఆరోపించారు. మహిళలను కించపరిచేలా మాట్లాడితే సీఎం జగన్ ఒప్పుకోరని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. Read Also: చంద్రబాబు మరోసారి మోసం చేస్తున్నాడు: లక్ష్మీపార్వతి మహిళలపై తమ పార్టీకి అపారమైన గౌరవం ఉందని…
ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనపై నందమూరి ఫ్యామిలీ ఖండించడంపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి స్పందించారు. అసెంబ్లీలో ఏమీ జరగకపోయినా టీడీపీ నేతలు మసిపూడి మారేడుకాయ చేస్తున్నారని ఆరోపించారు. ఆనాడు ఎన్టీఆర్‌ను మోసం చేసినట్లే.. ఈనాడు నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు మోసం చేస్తున్నాడని లక్ష్మీపార్వతి విమర్శలు చేశారు. కన్నీళ్లు పెట్టుకుని చంద్రబాబు పెద్ద సీన్ క్రియేట్ చేస్తున్నాడని ఆమె ఆరోపించారు. చంద్రబాబు వల్ల ఎన్టీఆర్ ఎంతో బాధపడ్డారని లక్ష్మీపార్వతి గుర్తుచేసుకున్నారు. Read Also: అసెంబ్లీ ఘటనపై స్పందించిన ఎన్టీఆర్…
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం బాధాకరమని హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ వ్యాఖ్యానించాడు. శుక్రవారం ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనపై హీరో కళ్యాణ్ రామ్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ‘అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలను చర్చించి వాటి పరిష్కారం కోసం పాటుపడే దేవాలయం వంటిది. అక్కడ చాలా మంది మేధావులు, చదువుకున్నవారు ఉంటారు. అలాంటి గొప్ప ప్రదేశంలో రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి గురించి వ్యక్తిగతంగా మాట్లాడటం ఎంతో బాధాకరం. ఇది…
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నేతల వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు, నటుడు నాగబాబు స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్లో సుదీర్ఘమైన పోస్టును పెట్టారు. ఏపీలో రాజకీయ భవిష్యత్‌ను తలుచుకుని బాధపడాలో లేదా భయపడాలో తెలియని దుస్థితి నెలకొందని ఆయన వాపోయారు. చంద్రబాబు తమకు ప్రత్యర్థి అయ్యి ఉండొచ్చని… కానీ చంద్రబాబు లాంటి సీనియర్ నేత కన్నీటి పర్యంతం కావడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని నాగబాబు ఆవేదన వ్యక్తం…
శుక్రవారం నాటి అసెంబ్లీ వేడి ఇంకా కొనసాగుతూనే ఉంది. వైసీపీ నేతల వ్యాఖ్యలను టీడీపీ నేతలతో పాటు పలు రాజకీయ పార్టీల నేతలు తప్పుపడుతున్నారు. నందమూరి కుటుంబ సభ్యులు కూడా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని కూడా స్పందించారు. రాజకీయాలు రాజకీయంగానే ఉండాలని నందమూరి సుహాసిని హితవు పలికారు. Read Also: బాబాయ్ గొడ్డలిపై చర్చిద్దాం అని ఎత్తింది చంద్రబాబు : పేర్ని నాని ‘భువనేశ్వరి ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు.…
తెలంగాణలో స్థానిక సంస్థల కోటాల 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రులతో సీఎం కేసీఆర్ కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన పై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం ప్రారంభం కానుంది. 12 మందిలో కొందరు అభ్యర్థులను మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ నెల 23 నామినేషన్ కు ఆఖరు తేదీగా…