మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. మంగళగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఆర్కే గెస్ట్ లెక్చరర్‌గా మారారని ఎద్దేవా చేశారు. వారానికి ఒకసారి నియోజకవర్గానికి వచ్చి నాలుగు ఫోటోలు దిగి జంప్ అవుతున్నారంటూ లోకేష్ ఆరోపించారు. గురువారం నాడు మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లిలో లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు తాగునీరు, ఇళ్ల పట్టాల సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. రకరకాల కారణాలు చెబుతూ దివ్యాంగులు,…
సినిమా యాక్టర్లతో తిరిగి కేటీఆర్ సినిమా డైలాగులు మాట్లాడుతున్నాడని నిజామాబాద్ లోక్ సభ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రంగా విమర్శలు చేశారు. తరుగు పేరుతో గత మూడు సంవత్సరాల నుంచి రైతులకు అన్యాయం జరుగుతుంటే టీఆర్ఎస్ నేతలు నోరు మెదపడం లేదని.. మిల్లర్లు, బ్లాక్ మార్కెటింగ్ వ్యవస్థతో సంబంధం లేకపోతే కేటీఆర్ ఎందుకు మాట్లాడడు? అని నిలదీశారు. గత మార్చి 14 నుండి భైంసాలో హిందువులపై ఎంఐఎం పార్టీ దాడులు జరిపారని… నలుగురు హిందూ వ్యక్తులను చంచల్…
2009, డిసెంబర్ 9కి తెలంగాణకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తెలంగాణ ఉద్యమం చివరి దశకు చేరిన సమయంలో కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో కేసీఆర్ దీక్ష ప్రారంభించారు. అప్పటికే ఆయన దీక్షలో ఉండి కొన్ని రోజులు అవుతుండగా ఆయన ఆరోగ్య పరిస్థితి సైతం రోజురోజుకు విషమిస్తుంది. దీంతో అప్పటి యూపీఏ ప్రభుత్వంలోని కేంద్ర మంత్రి చిందబరం తెలంగాణ ఏర్పాటు పై కీలక ప్రకటన చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభించామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ…
వివాదాస్పద షియా ఉత్తరప్రదేశ్ వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ వసీం రిజ్వీ సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో గల దాస్నా ఆలయంలో ఇస్లాం మతం వీడి హిందు మతం స్వీకరించారు. ఆలయ పూజారి యతి నర్సింహానంద సరస్వతి ఆచారాలను నిర్వహించి వసీం రిజ్వీని హిందు మతంలోకి మార్చారు. అయితే అనంతర రిజ్వీ పేరు జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగిగా మార్చినట్లు తెలిపారు. త్యాగిగా పేరు మార్చుకున్న రిజ్వీ మాట్లాడుతూ.. ఏ మతాన్ని అనుసరించాలనేది తన ఇష్టమని, కాబట్టి ప్రపంచంలోని…
ఏపీలో వచ్చిన వరద నష్టాన్ని పరిశీలించేందుకు ఒక్క కేంద్ర మంత్రి రాలేదని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వం, సీఎం జగన్ పై తీవ్రంగా విమర్శలు చేశారు. రాయలసీమలో వచ్చిన విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న జగన్ పర్యటనను ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. వరదలు వచ్చినప్పుడు ఏ ఒక్క ప్రజాప్రతినిధి ప్రజలకు అండగానిలవలేదని ఆయన మండిపడ్డారు.…
ఉద్యమ కార్యాచరణకు సిద్ధం చేసే సమయంలో నేను మాట్లాడిన మాటలను కొందరూ తప్పుగా అన్వయించారని, ప్రభుత్వాన్ని గద్దె దించుతామని నేను అనలేదని ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. నేను అనని మాటలను అన్నట్టుగా ట్రోల్ చేసి ఉద్యమం పక్కదారి పట్టించేందుకు కొన్ని మాధ్యమాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. నాలుగు గోడల మధ్య జరిగిన సమావేశంలో మాటలను బయట పెట్టి రాజకీయం చేసేందుకు ప్రయత్నించడం దురదృష్టకరమని బండి శ్రీనివాస్ అన్నారు.…
ఓటీఎస్ పేరుతో ప్రభుత్వం నిర్భంద వసూళ్లకు పాల్పడుతుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ …వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. అధికారులకు టార్గెట్ ఇచ్చి అక్రమంగా ఓటీఎస్ పేరుతో వసూళ్లు చేస్తున్నారని మండిపడ్డారు. మీడియా ముఖంగా నిరూపించడానికి బహిరంగ చర్చకు నేను సిద్ధం.. మంత్రి బొత్స అబద్ధాలడుతున్నారని, ముఖ్యమంత్రికి జగన్నే సవాల్ చేస్తున్నాని ఆయన అన్నారు. నిరూపించపోతే మేము రాజీనామా చేస్తాం.. నిరూపిస్తే…
యాసంగిలో వరి ధాన్యం సేకరణపై స్పష్టతను ఇవ్వాలని లోక్సభలో ఆందోళన చేపట్టిన టీఆర్ఎస్ ఎంపీలు ఈ రోజు సమావేశాల్లో కేంద్రం తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. జాతీయ ధాన్యం సేకరణ విధానం, మద్దతు ధరకు చట్టబద్ధతను కల్పించాలని డిమాండ్ చేశారు. లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం అయిన వెంటనే కేంద్రం వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. ఈ అంశంపై చర్చించాలంటూ ఎంపీ నామా నాగేశ్వర్రావు వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. టీఆర్ఎస్ ఎంపీల…
అంబేడ్కర్ 65వ వర్థంతిని స్మరించుకుంటూ ఆ మహనీయునికి జాతీ మొత్తం ఘన నివాళుర్పిస్తుందని టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశమంతటా రాజ్యాంగం ఒకేలా అమలు చేస్తుందన్నారు. కానీ ఏపీలో మాత్రం రాజ్యాంగం రోజు రోజుకు అవహేళనకు గురవుతుందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ర్టంలో రాజ్యాంగ విలువలు, హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. సమాజంలో ఉన్న వైషమ్యాలు రూపుమాపాలని డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించారన్నారు.…
భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడారు. అంబేడ్కర్తోనే దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలకు అవకాశాలు లభిస్తున్నాయన్నారు. అంబేద్కర్ ముందు చూపుతోనే మన దేశంలో రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ రిజర్వేషన్లను ఉపయోగించుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆమె పేర్కొన్నారు. కాగా అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వలనే వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. వెనుబడిన వర్గాల ప్రజలకు ఇంకా రాజ్యాంగ…