ఆంధ్రప్రదేశ్‌లో కేబినేట్ విస్తరణకు ఇంకా అవకాశం ఉందా లేదా అన్న అనుమానాలు రేకేత్తుతున్నాయి.కాగా ఇప్పట్లో ఏపీ క్యాబినేట్ విస్తరణ ఉండకపోవచ్చనే సమాధానం మాత్రం వస్తుంది. వచ్చే ఏడాది మే లేదా జూన్‌లో విస్తరించాలని సీఎం జగన్ భావిస్తున్నారని సమాచారం. రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మారుస్తామని గతంలో జగన్ చెప్పినా మరికొన్నాళ్లు వేచి చూసే అవకాశం లేకపోలేదు.
అటు విస్తరణలో అందర్ని మారిస్తే వారు శాఖలపై పట్టు సాధించేలోపు ఎన్నికలు వస్తాయని జగన్ ఆలోచిస్తున్నారు. 7-8 మందితో రాజీనామా చేయించి కొత్త వారికి అవకాశం కల్పించాలని జగన్ యోచిస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా చాలా మందికి అవకాశాలు ఇస్తామని గతంలో జగన్ చెప్పారు. వారందరూ ఇప్పటికే ఎంతో నిరీక్షిస్తున్నారు. కాగా ఏపీలో చాలా మంది ఎమ్మేల్యేలు మంత్రి పదవుల కోసం ఆశపడుతున్నారు. దీంతో చివరిలో మేము ఉంటామో లేదో అని ఆందోళన పడుతున్నారు. అయితే ఏపీ సీఎం జగన్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. దీంతో ఆశావాహులు ఇప్పటి నుంచే ఫైరవీలు మొదలు పెట్టే ప్రయాత్నాల్లో ఉన్నారు.