టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు ఖమ్మం జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. పీసీసీ చీఫ్ అయ్యాక మొదటి సారిగా ఆయన ఖమ్మం వస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ సభ విజయవంతం కోసం కార్యకర్తలతో మాట్లాడనున్నారు. వరంగల్ లో వచ్చే నెలలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ సభ జరుగనుంది. ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున కార్యకర్తలను తరలించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేణుకచౌదరి లు జిల్లా పార్టీ కార్యాలయంలోజరుగనున్న రివ్యూ మీటింగ్ లో పాల్గొనున్నారు. వరంగల్ కు సరిహద్దులో ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి భారీ ఎత్తున జనసమీకరణ చేయడానికి రంగం సిద్దం చేస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలు వరంగల్ కు సరిహద్దులో ఉండడంతో ఇక్కడ జన సమీకరణపై దృష్టి కేంద్రీకరించనున్నారు.
గత కొన్నిరోజులుగా ఖమ్మం జిల్లా కేంద్రంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు వ్యతిరేకంగా పరిణామాలు జరుగుతున్నాయి. బీజేపీ నేత సాయి గణేష్ ఆత్మహత్య చేసుకోవడంతో ఉద్రిక్తత పరిస్తితిలు జిల్లా కేంద్రంలో నెలకొన్నాయి. కాంగ్రెస్ కార్పోరేటర్ ల భర్తల మీద కూడ పలు కేసులు పెట్టారు. కాంగ్రెస్ కార్యకర్తల మీద పీడీ యాక్టు కేసులు, రౌడీ షీటర్ల కేసులు నమోదు అయ్యాయి. దీని మీద కూడ కాంగ్రెస్ ఇప్పటికే మండిపడుతోంది. దీంతో రేవంత్ రెడ్డి పర్యటన అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.