కేంద్రమంత్రి నితన్ గడ్కరీ నేడు తెలంగాణలో పలు నేషనల్ హైవే పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీశైలం హైవేను 4లేన్ల రహదారిగా విస్తరించాలని ఈ రోజు హైదరాబాద్ కు వచ్చిన కేంద్ర రోడ్డు రవాణా,జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రెడ్డి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద కలిసి వినతి పత్రం అందజేశారు. తన చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని జల్ పల్లి మునిసిపాలిటీ, పహాడి షరీఫ్ ప్రాంతాలు హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లే మార్గ మధ్యలో కి వస్తాయి.ఈ రోడ్డు ఇరుకుగా వుండటం వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దృష్ట్యా ఈ రోడ్డును 4 వరుసల జాతీయ రహదారి చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతిపత్రం అందజేశారు.