రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పలువురు సీఎం కేసీఆర్‌తో పాటు రాజకీయ పార్టీల ముఖ్య నేతలు, అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు. ఇందుకోసం నేతలంతా తమ సొంత నియోజకవర్గాలకు పయనమయ్యారు. సీఎం కేసీఆర్ గురువారం ఉదయం 9 గంటలకు తన స్వగ్రామం చింతమడకలో ఓటు వేయనున్నారు. అలాగే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్లోని జెడ్‌పీహెచ్ఎస్ పోలింగ్ బూతులో ఓటు వేస్తారు. కోరుట్లలో కాంగ్రెస్ అభ్యర్థి జువ్వాడి నర్సింగ రావు, మెట్‌పల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్,…
బూతులు మాట్లాడే వ్యక్తుల చరిత్ర పోలింగ్ బూత్ లో మార్చేయాలని పిలుపునిచ్చారు.. తుపాకీ గుండు వల్ల విప్లవం రాదు.. ప్రజల ఆలోచనతో విప్లవం రావాలన్న ఆయన.. దేవస్థానంలో ప్రమాణాలు చేసే రాజకీయాలు పెరిగిపోయాయి.. ఎప్పుడు ఏ జెండా పట్టుకుంటాడు తెలియడం లేదని ఎద్దేవా చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. తెలుగు లోగిళ్లలో కొత్త సందడి నెలకొంది. గ్రామాలన్నీ పండుగ సందడితో కళకళలాడుతున్నాయి. పల్లె, పట్నం అనే తేడా లేకుండా తెలుగు రాష్ట్రాల్లో బోగి మంటలు మండుతున్నాయి.
ప్రజా ప్రతినిధుల రెచ్చగొట్టే వ్యాఖ్యలపై పరిమితులు విధించాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెల్లడించింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల భావ ప్రకటన స్వేచ్ఛపై పరిమితులు విధించాలని.. ప్రజా ప్రతినిధులు చేసే విద్వేష వ్యాఖ్యల వల్ల సమాజంపై తీవ్ర ప్రభావం పడుతుందని పిటిషన్ దాఖలైంది.
ఇసుక ఎప్పుడూ డిమాండ్ వున్న వస్తువు. కొంతమంది నేతలు ఇసుక నుంచి కూడా కరెన్సీ పిండేస్తారు. తూర్పు గోదావరిలో ఇసుక అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. సబ్ కాంట్రాక్ట్ లు పేరుతో దోచేస్తున్నారు. అనుమతి లేకుండా కొన్ని చోట్ల, నిబంధనలకు విరుద్ధంగా ఇంకొన్నిచోట్ల అడ్డంగా తవ్వేస్తున్నారు. జిల్లాలో ఇసుకాసురులు చెలరేగిపోతున్నారు. కొన్ని చోట్ల అధికార పార్టీ ఛోటా నేతలు.. సబ్ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అందినకాడికి తవ్వుకుపోతున్నారని ఆరోపిస్తున్నారు. బోట్స్‌మన్ సొసైటీలైనా, ఓపెన్ ర్యాంపులైనా… వెనక రాజకీయ…
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం రోశయ్య మృతికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నారు.. సీఎంలు, మాజీ సీఎంలు, మంత్రులు, నేతలు, సినీ ప్రముఖులు ఇలా అంతా రోశయ్యకు సంతాపాన్ని ప్రకటిస్తూ.. కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నారు. ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆర్ధిక శాఖ మంత్రిగా పలు పదవులకు…