Venkaiah Naidu: ప్రజల ఆలోచనతో విప్లవం రావాలి.. బూతులు మాట్లాడే వ్యక్తుల చరిత్ర పోలింగ్ బూత్‌లో మార్చేయాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venkaiah Naidu: తుపాకీ గుండు వల్ల విప్లవం రాదు.. ప్రజల ఆలోచనతో విప్లవం రావాలని పిలుపునిచ్చారు భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. గుంటూరులోని రెవెన్యూ కళ్యాణ మండపంలో తెలుగు జర్నలిస్ట్ లకు ఉగాది పురస్కారం కార్యక్రమం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. రాజకీయాల్లో ప్రమాణాలు పడిపోతున్నాయన్నారు. ప్రజా సభల్లో ప్రమాణాలు పడిపోతున్నాయి, పత్రికా రంగంలో ప్రమాణాలు పడిపోతున్నాయి, ఈ ధోరణి దేశ గౌరవానికి ముప్పు అని హెచ్చరించారు.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
- ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
- Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
ఇక, విద్యా, వైద్య రంగాలు వ్యాపారం అయిపోయాయి.. అనవసర పరీక్షలతో వైద్యం రాద్ధాంతం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు వెంకయ్యనాయుడు.. రాజకీయాల్లో ఉండే శక్తులు విద్య ,వైద్య రంగాలలో ప్రవేశిస్తున్నారు.. రాజకీయ రంగంలో వ్యాఖ్యలు జుగుప్త్సా కరంగా తయారయ్యాయన్నారు.. అయితే, బూతులు మాట్లాడే వ్యక్తుల చరిత్ర పోలింగ్ బూత్ లో మార్చేయాలని పిలుపునిచ్చారు.. తుపాకీ గుండు వల్ల విప్లవం రాదు.. ప్రజల ఆలోచనతో విప్లవం రావాలన్న ఆయన.. దేవస్థానంలో ప్రమాణాలు చేసే రాజకీయాలు పెరిగిపోయాయి.. ఎప్పుడు ఏ జెండా పట్టుకుంటాడు తెలియడం లేదని ఎద్దేవా చేశారు. సిద్ధాంతం నచ్చక పోతే పార్టీ మారొచ్చు.. కానీ, పదవి కోసం పార్టీలు మారుతున్నారంటూ వ్యాఖ్యానించారు భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.
Read Also: Balineni Srinivasa Reddy: బాలినేని రాజీనామాపై వైసీపీలో ఉత్కంఠ.. నేడు సీఎం జగన్‌తో భేటీ..
మరోవైపు.. ఈ రోజు ఉదయం విజయవాడలోని SSS పాక హోటల్ లో ఇడ్లీని తిన్నారు వెంకయ్యనాయుడు.. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఈ రోజు ఉదయం విజయవాడ లోని SSS పాక హోటల్ లో చక్కటి ఇడ్లీని ఆస్వాదించాను. నోరూరించే వేరుశనగ పచ్చడి, అల్లం పచ్చడి, కారప్పొడి, నెయ్యితో ఈ ఇడ్లీలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయి. గుబురు చెట్ల నీడన, సంప్రదాయం ఉట్టిపడే ఈ పాక హోటల్లో ఒకసారైనా ఇడ్లీ రుచి చూడాలి. మంచి రుచికరమైన ఇడ్లీని అందిస్తున్న నిర్వాహకులకు, సిబ్బందికి అభినందనలు. బలవర్ధకమైన మన భారతీయ సంప్రదాయ వంటలను, రుచులను కాపాడుకోవాలని సూచించారు.
ఈ రోజు ఉదయం విజయవాడ లోని SSS పాక హోటల్ లో చక్కటి ఇడ్లీని ఆస్వాదించాను. నోరూరించే వేరుశనగ పచ్చడి, అల్లం పచ్చడి, కారప్పొడి, నెయ్యితో ఈ ఇడ్లీలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయి. pic.twitter.com/GJVZDaMn0I
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) May 2, 2023
తాజావార్తలు
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
-
West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
-
Mythri Ravi: “రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు”
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!