Health: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నకల హవా నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నకల వ్యవహారం వాడివేడి మీద సాగుతుంది. ప్రతి పార్టీ నేతలు గెలవాలనే కాక్షిస్తున్నారు. గెలుపు కోసం రాత్రి పగలు మర్చిపోయి సాయశక్తులా కృషి చేస్తున్నారు. ప్రతి నిమిషం ఎంతో విలువైనదిగా పార్టీ కోసం పని చేస్తూ నిద్రాహారాలు మాని ప్రచారంలో పాల్గొంటున్నారు. నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రజల మధ్యనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఆరోగ్యాన్ని సైతం పట్టించుకోకుండా గెలుపే ధ్యేయంగా ప్రచారంలో ముగిపోతున్నారు. ప్రచారంలో భాగంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పాదయాత్రలు, ప్రచారాల్లో తిరుగుతున్నారు. దీనితో చెమట రూపంలో శరీరంలోని నీరంతా పోయి డీహ్రైడేషన్ ముప్పు పొంచి ఉండే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read also:SBI recruitment 2023: ఎస్బీఐలో భారీగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్..
అలానే ప్రచారంలో భాగంగా ఎక్కువ సేపు బయట తిరగడం వల్ల నీరసం, నాలుక తడారిపోవడం, మూత్రం రంగు మారడం లాంటి లక్షణాలు కన్పిస్తే.. నీళ్లు మాత్రమే కాకుండా ఓఆర్‌ఎస్, ఉప్పు, చక్కెర కలిపిన మజ్జిగ, కొబ్బరి నీళ్లు లాంటివి తీసుకుంటే శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్ తిరిగి పొందవచ్చు అని వైద్యులు సూచిస్తున్నారు. అలానే దీర్ఘకాలిక వ్యాధులు అయినటువంటి అధిక రక్తపోటు, మధుమేహం తదితర వ్యాధులతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి అని వైద్యులు పేర్కొంటున్నారు. అలానే ఉద్యమ అల్పాహారం అశ్రద్ధ చేయకూడదని.. తాజా కూరగాయలు పండ్లు ఇతర డ్రైఫూట్స్, ఎక్కువ పీచుఉండే పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చని, కాఫీలు, టీలు ఎక్కువగా తాగక పోవడమే మంచిదని సూచిస్తున్నారు.