హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం షాకిచ్చింది. కొత్త నిబంధన ప్రకారం పోలింగ్‌కు మూడు రోజుల ముందు స్థానికేతర నాయకులు హుజూరాబాద్‌ను వీడాలి. ప్రధాన పార్టీలకు నిజంగా ఇది పెద్ద దెబ్బే అని చెప్పాలి. దీంతో ఆయా పార్టీలు ఇప్పుడు కొత్త వ్యూహాలు సిద్ధం చేసుకోవాల్సి వచ్చింది. గత మూడు నాలుగు నెలలుగా హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలు కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు సాగుతున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓటర్లు కాని టిఆర్ఎస్, బిజెపి,…
హుజురాబాద్ ఉప ఎన్నిక తెలంగాణతో పాటు దేశం దృష్టిని కూడా ఆకర్షిస్తోంది. ఈ ఎన్నికను దేశంలోనే అత్యంత ఖరీదైనదిగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఒక్క రోజు ప్రచారంలో లక్షలు ఖర్చు పెడుతున్నారు. పొద్దుగూకితే చాలు గ్రామాల్లో మద్యం ఏరులవుతుంది. ఇదే సమయంలో రాజకీయం రంజుగా సాగుతోంది. రాత్రికి రాత్రి గ్రామ స్థాయి నాయకులను బట్టలో వేసుకుంటున్నారు. విందులు, వినోదాలతో పాటు కరెన్సీ కట్టలతో వారిని కట్టిపడేస్తున్నారు. మూడు ప్రధాన పార్టీలూ ఈ తరహా రాజకీయంలో ఆరితేరాయి. కాస్తా…
సైదాబాద్ ప్రాంతానికి చెందిన చిన్నారిపై.. కామోద్రేకంతో రాజు అనే యువకుడు చేసిన పైశాచికత్వం.. యావత్ దేశాన్ని కదిలిస్తోంది. సామాన్యులనే కాదు.. సమాజంలోని సర్వ శక్తులూ.. ఆ బాధిత కుటుంబం వైపే చూసేలా చేస్తోంది. వారం రోజులుగా.. ప్రతి ఒక్కరూ.. ఆ వార్తనే ప్రసారం చేస్తున్న తీరుతో.. జనాల్లో భావోద్వేగం పెరుగుతోంది. ఈ తీరును గమనించిన రాజకీయ పార్టీల నేతలు సైతం.. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం చూస్తూనే ఉన్నాం. ఇక్కడే.. కొందరు ఓ విషయంపై…
సీజన్ తో సంబంధం లేకుండా.. భక్త జన ప్రవాహం కనిపించే ఆలయాల్లో.. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం ఒకటి. కొన్ని రోజుల క్రితం వరకూ… ఆలయం లోపలి వ్యవహారాలు వివాదాస్పదమైన విషయం చూస్తూనే ఉన్నాం. తాజాగా.. ఆలయం వెలుపల జరుగుతున్న ఓ వ్యవహారం.. భక్తులకు ఇబ్బందికరంగా మారుతోంది. అమరావతిని రాజధానిగా గుర్తించిన తర్వాత మొదలైన ఈ వ్యవహారం.. ఇటీవల మరింత పెరిగి.. భక్తులకు సమస్యలు పెంచుతోంది. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు చూస్తే.. దేవాదాయ శాఖ మంత్రి కార్యాలయం…
ఆఫ్ఘనిస్థాన్‌లో తాజా పరిణామాలు కలవర పెడుతున్నాయి.. ఇక, మరికొంత మంది భారతీయులు.. అక్కడ చిక్కుకోవడం ఆందోళనకు గురిచేస్తోంది.. ఈ నేపథ్యంలో ఆప్ఘన్ పరిణామాలపై దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం.. ఈ నెల 26వ తేదీన అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది.. ఈ సమావేశంలో తాజా పరిస్థితిని విపక్షాలకు వివరించనుంది కేంద్ర ప్రభుత్వం.. ప్రధానంగా ఆఫ్ఘన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడంపైనే కేంద్రం దృష్టిసారించినట్టుగా తెలుస్తోంది. ఆఫ్ఘన్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయి.. ఇంకా ఎంతమంది భారతీయులు అక్కడ ఉన్నారు.. వారిని…