రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పలువురు సీఎం కేసీఆర్‌తో పాటు రాజకీయ పార్టీల ముఖ్య నేతలు, అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు. ఇందుకోసం నేతలంతా తమ సొంత నియోజకవర్గాలకు పయనమయ్యారు. సీఎం కేసీఆర్ గురువారం ఉదయం 9 గంటలకు తన స్వగ్రామం చింతమడకలో ఓటు వేయనున్నారు. అలాగే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్లోని జెడ్‌పీహెచ్ఎస్ పోలింగ్ బూతులో ఓటు వేస్తారు. కోరుట్లలో కాంగ్రెస్ అభ్యర్థి జువ్వాడి నర్సింగ రావు, మెట్‌పల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్, నిజామాబాద్ అర్బన్‌లో బీజేపీ అభ్యర్థి అరవింద్‌లు తమ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు.
Also Read: Gaami: అర్ధంకాని రోగంతో బాధపడుతున్నా.. విశ్వక్ డైలాగ్ వైరల్
కోనరావుపేట మండలం నాగారం మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, కమలపూర్ మండల కేంద్రంలో బీజేపీ నేత ఈటెల రాజేందర్, హుస్నాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్, కరీంనగర్ సాధన స్కూల్ పోలింగ్ బూతులో బండి సంజయ్, చర్చి కాలనీలో మంత్రి గంగుల కమలాకర్లు ఓటు వేస్తారు. మంథని నియోజకవర్గం కాటారంమండలం ధన్వాడలో ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులు… మాజీ మంత్రి శ్రీధర్ బాబు, bsp అభ్యర్థి చల్లా నారాయణరెడ్డిలు ఓటు వేయనున్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ గోదావరి ఖనిలో ఓటు హక్కు వినియోగించుకొనున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ, పద్మావతి రెడ్డి గారు కోదాడలోని గ్రేస్ వ్యాలీ ఐడియల్ స్కూల్లో ఓటు వేస్తారు. భట్టి విక్రమార్క గారు మధిర పట్టణంలోని సుబ్దరయ్య నగర్ మండల పరిషత్ పాఠశాలలో ఓటు వేస్తారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎంపీ గారు నల్గొండ పట్టణంలో వేస్తారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు బ్రహ్నన వెల్లంల గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకుంటారు.
Also Read: Vijayakanth: కెప్టెన్ విజయకాంత్ చనిపోలేదు.. భార్య ప్రేమలత క్లారిటీ