Supreme Court : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన నోటీసులపై ఎటువంటి స్పందన రాకపోవడంతో, కోర్టు మరోసారి ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసు విచారణ ఈ నెల 25న సుప్రీంకోర్టులో జరగనుంది. గతంలో సుప్రీంకోర్టు ప్రభుత్వానికి, అసెంబ్లీ కార్యదర్శికి, 10 మంది ఎమ్మెల్యేలకు, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. అయితే, బీఆర్ఎస్ పార్టీ వేసిన పిటిషన్‌పై ఈ నెల 22 లోపు సమాధానం ఇవ్వాలని నోటీసులు పంపించగా, నిర్ణీత గడువు ముగియడంతో కోర్టు మరోసారి నోటీసులను జారీ చేసింది.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన 10 మంది, అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ ఫిరాయింపును చట్టబద్ధంగా నిలదీయాలని, సంబంధిత ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ న్యాయపరమైన పోరాటాన్ని కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో, పార్టీ ఫిరాయింపు వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో వేడెక్కుతున్నదనే చెప్పాలి.
సుప్రీంకోర్టు ఇప్పటికే ప్రభుత్వాన్ని, అసెంబ్లీ అధికారులను ఈ వ్యవహారంపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆదేశించినప్పటికీ, తగిన స్పందన లేకపోవడంతో మళ్లీ నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయింపుల కేసులో తుది నిర్ణయం ఎలా వస్తుందనేదానిపై అందరి దృష్టి నిలిచింది.
Haryana: ఓ ఇంట్లో భారీ పేలుడు.. నలుగురు మృతి