Kota Vinutha: జనసేన బహిష్కృత నాయకురాలు కోట వినుత సెల్ఫీ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో మనసునిండా పుట్టెడు బాధ ఉంది.. చేయని తప్పుకు జైలుకు వెళ్లిన బాధ లేకపోయినా, మేము చంపామని ప్రచారం చేయడం చాలా బాధ కలిగిస్తోంది అని ఆవేదన వ్యక్తం చేసింది.
తమిళ సినీ సూపర్‌స్టార్, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు తలపతి విజయ్‌పై, ఆయన బౌన్సర్లపై కున్నం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మదురైలో ఇటీవల జరిగిన టీవీకే భారీ బహిరంగ సభలో శరత్ కుమార్ అనే వ్యక్తిపై దాడి చేయడంతో గాయాలై నట్లు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. 2026 తమిళనాడు ఎన్నికలకు ముందు విజయ్ తన రాజకీయ భావజాలాన్ని వివరించేందుకు ఏర్పాటు చేసిన ఈ సభకి లక్షలాది మంది అభిమానులు, మద్దతుదారులు…
Harish Rao : కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన తాజా నివేదికను మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. గత 20 నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను “గాలికి వదిలేసి” రాజకీయ కక్షలు సాధించేందుకే కమిషన్‌లను ఏర్పాటు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. డబ్బులు దంచుకోవడానికీ, ప్రతిపక్షాలపై కేసులు పెట్టడానికీ ఈ కమిషన్‌లు సాధనంగా మారాయని అన్నారు. హరీష్ రావు మాట్లాడుతూ, “పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక రిపోర్ట్, బీఆర్ఎస్ రాజతోత్సవ సభ ముందు ఒక రిపోర్ట్,…
తనను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్‌కౌంటర్ చేయాలని ప్లాన్ చేసినట్లు ఎమ్మెల్యే రాజాసింగ్ వెల్లడించారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. నాడు జరిగిన సంచలన విషయాలను వివరించారు. తాను హిందు వాహినిలో చేరి యువతను ధర్మం వైపునకు వచ్చేలా చర్యలు కార్యక్రమాలు చేపట్టానని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో తమ కార్యక్రమాలకు ఎప్పుడూ ఏదో ఒక గొడవ సృష్టించేవారని, తాము ఎక్కడికి వెళితే అక్కడ 144 సెక్షన్ అమలు చేసేవారని రాజాసింగ్ తెలిపారు.
Malegaon blast: 2008 మలేగావ్ కేసు దర్యాప్తు సమయంలో మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS)లో కీలక అధికారి అయిన రిటైర్డ్ ఇన్‌స్పెక్టర్ మెహిబూబ్ ముజావర్ సంచలన వ్యాక్యలు చేశారు. ఈ కేసులో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను అరెస్ట్ చేయాలని తనను కోరారని చెప్పారు. బీజేపీ ఎంపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌తో సహా ఈ కేసులో ఏడుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ప్రత్యేక NIA కోర్టు ఇచ్చిన తీర్పుకు ప్రతిస్పందనగా గురువారం రిటైర్డ్ ఇన్‌స్పెక్టర్…
సీఎం చంద్రబాబును స్కిల్ స్కాంలో అరెస్ట్ చేశారు కాబట్టి.. మాజీ సీఎం వైఎస్ జగన్‌ను అరెస్ట్ చేయాలని చూస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఒక అద్భుతాన్ని తయారు చేసినట్లుగా జగన్ మీద విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో తన కొడుకుకు జగన్ అడ్డంకి లేకుండా చేయాలనే చంద్రబాబు తపనపడుతున్నారని పేర్కొన్నారు. మిగతా వారు అయితే మాట వింటారని.. జగన్ వినడు కాబట్టి కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్…
Bandi Sanjay: తెలంగాణలో బోనాల పండుగ సందర్భంగా బంజారాహిల్స్‌లోని పెద్దమ్మ గుడిని కూల్చడం పట్ల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్.. పహల్గామ్ ఉగ్ర దాడికి ఆద్యుడు. కాశ్మీర్‌పై రెచ్చగొట్టిన ప్రసంగం చేసిన తర్వాతే ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడి జరిగింది.
జనసేనకు చెందిన కొందరి నేతల డర్టీ పనులు పార్టీపై ప్రభావం చూపిస్తున్నాయి. ప్రతిపక్షాలు మాత్రమే కాదు, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సామాన్యులు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. కొందరు నేతల డర్టీ వీడియోలు, లైంగిక ఆరోపణలు, కుటుంబ కలహాలు ఇలా ప్రతి సంఘటన కూడా ప్రత్యక్షంగా పార్టీపై ప్రతికూలంగా ప్రభావం చూపుతున్నాయి.
రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించే అధికారం ఎవ్వరికి లేదని... 2021 హుజరాబాద్ ఉప ఎన్నికల్లో నా ఫోన్ టాప్ చేశారని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా విచారణకు హాజరయ్యారైన ఆయన సిట్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తనను ఓడగొట్టాలని ప్రయత్నలు చేశారని.. తాను ఎవ్వరితో మాట్లాడుతున్నానో తెలుసుకున్నారన్నారు.