టీడీపీ నేత సుధాకర్ నాయుడు హత్యకు కుట్రలో ట్విస్ట్ నెలకొంది. అనంతపురం డీఎస్పీ ఆఫీసులో టీడీపీ నేత సుధాకర్ నాయుడు ప్రత్యక్షమయ్యారు. ఉదయం నుంచి సుధాకర్ నాయుడు హత్యకు కుట్ర అని జోరుగా ప్రచారం జరిగింది. కానీ.. ఆయన విచారణ నిమిత్తం డిఎస్పీ ఆఫీస్‌కు వచ్చారు. దాదాపు గంటన్నర పాటు సుధాకర్ నాయుడును డిఎస్పీ శ్రీనివాసులు విచారించారు. విచారణ అనంతరం మీడియాకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు.
గంజాయి వ్యాపారులు, డ్రగ్ డీలర్లు, బ్లేడ్ బ్యాచ్‌లకు జగన్‌ను గౌరవ అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందేమో అని పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ఎద్దేవా చేశారు. గంజాయి అమ్మడం, ఆడపిల్లలను వేధించడం నేరం కాదన్నట్లుగా జగన్ మాటలు ఉన్నాయన్నారు. తాజాగా జగన్ వ్యాఖ్యలపై స్పందించారు. గతంలో మతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టారన్నారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని ప్రజలంటే జగన్ కి కోపం రోజురోజుకూ పెరిగిపోతోందని ఆరోపించారు.
పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు షామిర్ పేటలో కలిశారన్నారు. ఒక ఫామ్ హౌస్ లో సీక్రెట్ గా కలిశారని ఆరోపించారు. కేసీఆర్ చెప్పారు కాబట్టే హరీష్, ఈటల కలిశారన్నారు. కాళేశ్వరం కమిషన్ విషయంలో అంత ఒకటే సమాధానం చెప్పాలని మాట్లాడుకున్నారన్నారు.
DK Aruna : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసినట్లుగా పత్రికల్లో వచ్చిన లేఖ. ఈ లేఖపై బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్ర విమర్శలు చేశారు. తండ్రికి కూతురు లేఖ రాయాల్సిన అవసరం ఏముంది? నిజంగా కవిత ఈ లేఖ రాశారా? లేదా ఆమె పేరుతో వేరే ఎవరైనా విడుదల చేశారా? అనే అనుమానాలను ఆమె వ్యక్తం చేశారు. ఈ లేఖ విడుదల వెనుక రాజకీయ ఎత్తుగడ ఉందని డీకే…
Satyavathi Rathod: ఫార్ముల ఈ రేస్ కారు వ్యవహారంపై బీఆర్‌ఎస్ మహిళా నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా.. ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నమని ఆమె విమర్శించారు. కేటీఆర్ పై పెట్టిన కేసు అక్రమకేసు అని, 1992లో ఈ కార్ రెస్ నిర్వహించాలని చంద్రబాబు ప్రయత్నించినా.. ఇంతవరకూ ఎవరూ ఈ రేస్ ను తీసుకురాలేదన్నారు. హైదరాబాద్ ను ప్రపంచ పటంలో…
Lagacherla : రైతు ఈర్యా నాయక్‌కి బేడీల కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సంగారెడ్డి సెంట్రల్ జైలు సిబ్బంది తప్పిదం వల్లే రైతుకు బేడీలు వేసినట్లు తెలుస్తోంది. వికారాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా సైబరాబాద్ పోలీసులకు జైలు అధికారులు సమాచారమిచ్చినట్లు విచారణ తేలింది. జైలు రికార్డులో ఈర్యా నాయక్ లగచర్ల కేసులో నిందితుడిగా కాకుండా బాలానగర్ లోని ఓ కేసులో నిందితుడిగా ఉన్నట్టు జైలు సిబ్బంది పేర్కొన్నారు. దీని వెనుక కూడా రాజకీయ కుట్ర…
వికారాబాద్ కలెక్టర్‌పై దాడి ముమ్మాటికీ కుట్ర కోణం దాగి ఉందని ఐజీ సత్యనారాయణ అన్నారు. ఇవాళ NTVతో మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ మాట్లాడుతూ.. కలెక్టర్‌పై దాడి చేసిన 16 మందిని రిమాండ్ చేశామని, 55 మంది అనుమానితులను విచరించామన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సురేష్ ఎవరి ప్రోత్బలంతో కలెక్టర్‌పై దాడి చేశాడు అతని బాక్ గ్రౌండ్ ఏంటి అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.