Minister Nimmala: నెల్లూరు జిల్లాలో జరిగిన ఘటనకు కులం రంగు పులిమి వైసీపీ విష ప్రచారం చేయడం ఆ పార్టీ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. శవ రాజకీయాలు సృష్టించి ఆ మంటల్లో చలి కాచుకోవాలని చూస్తుందని అన్నారు.
సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుక మందమంటూ చంద్రబాబు గర్వంగా, అహంకారంగా వ్యవహరిస్తున్నారన్నారు. వైఎస్ఆర్సీపీ జిల్లాస్థాయి సమావేశంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు. బాబుకు మోసం తప్ప చిత్తశుద్ధి తెలియదని విమర్శించారు. అక్రమ కేసులు పెట్టి బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
Harish Rao: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితులపై కౌంటర్ వేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై జరుగుతున్న విచారణల నేపథ్యంలో ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ.. లొట్టపీసు కేసులో కేటీఆర్ విచారణకు వెళ్లి వచ్చారు. కానీ, ఇది కేవలం రాజకీయ కక్షనే అని అన్నారు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి 14 నెలల కాలంలో కేటీఆర్‌పై 14 కేసులు…
ఏడాది కాలంలో కూటమి ప్రజలను వంచించిందని తిరుపతి, చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి అన్నారు. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు కు వెన్నుపోటు పుస్తకాన్ని ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రసారమధ్యమల్లో తమ నాయకుడిపై విషాన్ని నింపడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు..
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శించారు. తమకు ఓట్లు వేసి గెలిపించిన జనాల పైనే రేవంత్ రెడ్డి తన ప్రతాపం చూపిస్తున్నారని.. హైడ్రా తో ఇళ్లను కూలగొట్టడం, రైతుల ధాన్యం కొనక పోవడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు.
గడిచిన 115 రోజులుగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఉద్దేశ్యపూర్వకంగా జైలులో ఉంచారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఎలాగైనా ఆయన్ని ఇబ్బందులు పెట్టాలని కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.. పేర్ని నాని శనివారం మీడియాతో మాట్లాడారు. ఒక కేసులో బెయిలు వస్తుందంటే మరో కొత్త కేసు నమోదు చేస్తున్నారన్నారు.. కేసు మీద కేసు అంటూ తప్పుడు కేసులు పెడుతున్నారని.. వంశీ విషయంలో దేవుడు ఉన్నాడు..
చంద్రబాబు నాయకత్వంలో మహానాడు పేరుతో దగానాడు జరగబోతోందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.. కేవలం ఏపీలోని ప్రజలకే కాదు.. జెండా మోసిన కార్యకర్తలకు కూడా దగానాడే అని విమర్శించారు.. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. మహానాడుపై విమర్శలు గుప్పించారు.
కేటీఆర్ వ్యాఖ్యలు పిటిషన్ గా తీసుకొని సీబీఐ విచారణ చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో బాంబులు పెట్టారని కేటీఆర్ అంటున్నారని.. కేటీఆర్ అడుగుతున్నట్టు కాళేశ్వరంలో బాంబులు పెట్టినట్టు అయితే కేటీఆర్ వ్యాఖ్యలు పిటిషన్ గా తీసుకొని సీబీఐతో విచారణ చేయించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు తెలిపారు. హనుమకొండ జిల్లా ములకనూరులో మంత్రి మాట్లాడారు.
ఓబుళాపురం మైనింగ్ కేసులో తనను సీబీఐ కోర్టు నిర్దోషిగా ప్రకటించడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కోర్టు తీర్పు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పన్నెండు న్నరేళ్ల కిందట కోర్టు మెట్లేక్కినట్లు చెప్పారు. ఏ తప్పు చేయకపోయినా కోర్టు మెట్ల ఎక్కాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రకమైన బాధ ఆరోజు కోర్టు మెట్లు ఎక్కినప్పుడు అనుభవించానన్నారు.
Rega Kanta Rao : బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వరంగల్‌లో భారీగా రజోత్సవాలు, గులాబీ పండుగ నిర్వహిస్తున్నట్లు భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు తెలిపారు. తెలంగాణ సాధనకు 60 ఏళ్లుగా కృషి చేసిన కేసీఆర్ నాయకత్వంలో మహాసభ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ మహాసభను అడ్డుకోవడానికి తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని కాంతారావు ఆరోపించారు. సభకు ప్రజలను వెళ్లకుండా చేయడానికి స్కూల్ బస్సులు, ప్రైవేట్…