MLA Arava Sridhar: రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణకు జనసేన పార్టీ కమిటీని నియమించింది. అరవ శ్రీధర్‌పై ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలు, ఒక మహిళ చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ చేయాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. దీనిపై ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో టీ. శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, టీసీ. వరుణ్ సభ్యులుగా ఉన్నారు. అరవ శ్రీధర్ ఏడు రోజుల్లోపు కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇక, ఆరోపణలపై నిజా నిజాలు పరిశీలించి.. కమిటీ పార్టీకి నివేదిక అందించనుంది. ఆ నివేదికను పరిశీలించి తుది నిర్ణయం తీసుకునే వరకు అరవ శ్రీధర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గం స్పష్టం చేసింది.
Read Also: Ajit Pawar: పూణెకు రానున్న అజిత్ పవార్ మృతదేహం..! భారీగా తరలివస్తున్న అభిమానులు
అయితే, తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఏడాదిన్నరగా తనను బెదిరిస్తూ, అఘాయిత్యానికి పాల్పడ్డారని ఓ మహిళా ఉద్యోగి ఆరోపించింది. ఈ ఏడాదిన్నరలో తనను ఐదుసార్లు గర్భవతిని చేశాడని.. అబార్షన్ కూడా చేయించారని పేర్కొనింది. అంతే కాకుండా నా భర్తకు విడాకులు ఇవ్వమని వేధిస్తున్నాడని ఆమె ఆరోపించింది. తనను పెళ్లి చేసుకుంటానని బలవంతం చేయడమే కాకుండా.. అందుకు ఒప్పుకోకపోతే, నా భర్తకు ఫోన్ చేసి బెదిరించాడని బాధితురాలు వాపోయింది.