Counting Votes: ఏపీలో కౌంటింగ్కు ఏర్పాట్లు.. రాష్ట్రానికి 20 కంపెనీల కేంద్ర బలగాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌంటింగ్ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే సమస్యాత్మకంగా మారిన పల్నాడు, తిరుపతి, తాడిపత్రిలో ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్ మీనా చెప్పారు. జూన్ 4వ తేదీన చేపట్టనున్న కౌటింగ్ కు ఏర్పాట్లు దాదాపు పూర్తి కావొచ్చని పేర్కొన్నారు. స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ కేంద్రాల దగ్గర భద్రతను పటిష్టం చేశారు. ఓట్లు లెక్కించేటప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగితే సంబంధిత రిటర్నింగ్ అధికారి స్పందించాలని సీఈఓ మీనా వెల్లడించారు. పోలింగ్ ముందురోజు, ఆ తర్వాత హింసాత్మక ఘటనల్లో పాల్గొన్న వారిని కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే, రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు జరగకుండా దాదాపు 20 కంపెనీల కేంద్ర బలగాలను ఏపీకి కేటాయించినట్లు చెప్పుకొచ్చారు.
Read Also: Sriranga Neethulu : ఓటీటీలో కాకుండా నేరుగా యూట్యూబ్ లోకి వచ్చేస్తున్న సుహాస్ మూవీ..
Also Read
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
ఇక, కౌంటింగ్ నేపథ్యంలో జూన్ 3, 4, 5 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాలు నిషేధిస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా చెప్పుకొచ్చారు. పోలీసులతో పాటు అగ్నిమాపక శాఖ అధికారులు అలర్ట్ గా ఉండాలని పేర్కొన్నారు. అలాగే, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఎప్పటికప్పుడు పరిశీలించి, అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని ఆయన సూచించారు. పోలీసు సిబ్బందికి అదనంగా బాడీ కెమెరాలు అమర్చాలని డీజీపీ సూచించారు. దీంతో పోటు కౌంటింగ్ రోజు ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అనుమానం వచ్చి ప్రతి ఒక్కరిని బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు హరీశ్ కుమార్ గుప్తా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!