ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ 15 ఏళ్ల యువకుడిపై పలుమార్లు అత్యాచారం చేశాడు 46 ఏళ్ల వ్యక్తి. అయితే ఆ వ్యక్తిని బాలుడు హత్య చేశాడు. అనంతరం బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హకీమ్ నజాకత్ అనే వ్యక్తి అసభ్యకరమైన వీడియోను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేయడంతో యువకుడు కత్తితో పొడిచి హతమార్చాడు. వివరాల్లోకి వెళ్తే.. మే 19న నజకత్ భార్య, అతని పిల్లలు తన తల్లి ఇంటికి వెళ్లింది. అయితే ఆ సమయంలో ఒంటరిగా ఉన్న నజకత్.. బాలుడిని తన ఇంటికి రప్పించుకున్నాడు. లేకుంటే అతను యువకుడి వీడియోను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తానని బెదిరించినట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (రూరల్) ఆదిత్య బన్సాల్ తెలిపారు. ఈ క్రమంలో.. ఇంటికి వెళ్లిన బాలుడిపై బలవంతంగా అత్యాచారం చేస్తుండగా.. ప్రతిఘటన మధ్య బాలుడు అక్కడే ఉన్న కత్తితో నజాకత్ మెడ, తలపై పొడిచి చంపాడు.
Anjali : “రత్నమాల” పాత్రలో నటించడానికి కారణం అదే..?
అనంతరం.. బాలుడు అసభ్యకరమైన వీడియో ఉన్న నజాకత్ మొబైల్ ఫోన్‌ను తీసుకున్నాడు. టెర్రస్‌పైకి వెళ్లి దానిని అక్కడ నుండి విసిరి ధ్వంసం చేశాడు. అంతేకాకుండా.. అతను చంపడానికి ఉపయోగించిన కత్తిని కూడా కిందకు విసిరాడు. మే 20న జరిగిన ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా.. నజకత్ రక్తంతో తడిసిన పాక్షిక నగ్న మృతదేహాన్ని అతని ఇంట్లో గుర్తించారు. విచారణలో పోలీసులు పగిలిన మొబైల్ ఫోన్, హత్యాయుధాన్ని గుర్తించారు. నేరం అంగీకరించిన తర్వాత బాలుడిని అరెస్ట్ చేశారు.
PM Modi: చిన్నప్పుడు కప్పులు, ప్లేట్లు కడుగుతూ పెరిగాను.. చాయ్‌తో ప్రత్యేక అనుబంధం..
నజాకత్‌కు నేర చరిత్ర ఉందని.. అతనిపై హత్యాయత్నం, గోహత్య సహా డజనుకు పైగా కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. అతను ‘హకీమ్’ అని, ‘తాంత్రికులు’ (క్షుద్రవాదులతో) వ్యవహరించేవాడని ఎస్పీ బన్సాల్ తెలిపారు. పోలీసులు నజాకత్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి పంపించారు. అనంతరం యువకుడిపై పోలీసులు విచారణ చేపట్టారు. బాలుడితో గత రెండు నెలలుగా నజాకత్ తో అక్రమ సంబంధం ఉందని.. అతను కత్తి చూపించి భయపెట్టి లైంగికంగా వేధించేవాడని.. అతను అసభ్యకరమైన వీడియోను కూడా చేశాడని ఎస్పీ బన్సాల్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.