BRS MLC Pochampally: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి రాజకీయం హీటెక్కింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మొయినాబాద్ లోని ఫామ్ హౌస్ లో కోడి పందాలు, క్యాసినో కేసులో నోటీసులు అందజేశారు. గతంలో నోటీసులకు న్యాయవాది ద్వారా సమాధానం ఇచ్చిన పోచంపల్లిని వ్యక్తిగతంగా హాజరు కావాలని మొయినాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. హైటెక్ సిటీలోని అపర్ణా ఆర్చిడ్స్ లోని ఆయన నివాసానికి వచ్చి నోటీసులు జారీ చేసిన పోలీసులు.. అలాగే, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ కార్యాలయం గేటు వద్ద గోడకు పోలీసులు నోటీసు కాఫీ అతికించారు. ఇక, రేపు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ ఆయనకి ఇచ్చిన నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు.
Read Also: Lift Accident: మరో పసిప్రాణాన్ని బలిగొన్న లిఫ్ట్.. నాలుగున్నరేళ్ల చిన్నారి మృతి
ఇక, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిపై గేమింగ్ యాక్ట్ సెక్షన్ 3, 4తో పాటు జంతువుల పట్ల క్రూరత్వం యాక్ట్ 1960లోని సెక్షన్ 11 ప్రకారం కేసు నమోదు చేశారు. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలలోపు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొన్నారు. గతంలోనే ఫామ్ హౌస్ కు సంబంధించిన లీజు డాక్యుమెంట్లు మొయినాబాద్ పోలీసులకు పోచంపల్లి లాయర్లు అందజేశారు. లీజు డాక్యుమెంట్స్ పై కొన్ని అనుమానాలు ఉండడంతో వాటిని నివృత్తి చేసుకునేందుకు మరోసారి పోచంపల్లిని విచారణకు రావాలంటూ పోలీసులు నోటీసులు పంపించారు.