మెదక్ జిల్లా శివంపేట మండలం కొత్తపేట గ్రామంలో భూవివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. కారంపొడి, కొడవళ్లు, గొడ్డళ్లు, కర్రలతో రెండు వర్గాలు దాడి చేసుకున్నాయి.
TSPSC : టీఎస్సీపీఎస్సీ పేపర్ లీకేజీ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసు దర్యాప్తులో సిట్ అధికారులు వేగం పెంచారు. తాజాగా సిట్ అధికారులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు.
అబ్దుల్ వహీద్ అనే బాలుడి మృతదేహం ఇంటికి సమీపంలోని నాలాలో కుటుంబ సభ్యులు గుర్తించారు. ఎనిమిదేళ్ల బాలుడు వహీద్ ను ఇమ్రాన్ అనే ట్రాన్స్ జెండర్ హత్య చేసిందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్ నగరశివారులో IPL బెట్టింగ్ నిర్వహిస్తున్న స్థావరాలపై పోలీసుల దాడి చేశారు. ఈ దాడుల్లో 12 మంది నిందితులను అరెస్టు చేయగా.. అందులో ఐదుగురు పరారీలో ఉన్నారు.
కరీంనగర్ జిల్లాలో అర్ధరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. మానకొండూర్లో అరుణ్ అనే వ్యక్తిపై నలుగురు వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపారు. గన్ మిస్ ఫైర్ కావడంతో అరుణ్ తృటిలో తప్పించుకున్నాడు.
Vijayawada Crime: విజయవాడలో దారుణం చోటుచేసుకుంది.. ప్రేమ వ్యవహారంలో ఒక వ్యక్తి దారుణంగా హత్యకు గురైన ఘటన బెజవాడలో చోటుచేసుకుంది.. వివరాల్లోకి వెళ్తే విజయవాడకు చెందిన నవీన్ కు ఒంగోలుకు చెందిన బాలికతో పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది.. దీంతో సదరు మైనర్ బాలిక.. నవీన్ కోసం ఒంగోలు నుండి విజయవాడలోని నవీన్ ఇంటికి వెళ్లిపోయింది.. ఇక, బాలికను బుజ్జగించి ఇంటికి తీసుకెళ్తామని వచ్చిన కుటుంబ సభ్యులు.. విజయవాడ చిట్టి నగర్…
Traffic Restrictions in Vijayawada: రంజాన్ మాసంలో వరుసగా విఫ్తార్ విందులు నడుస్తున్నాయి.. రాజకీయ పార్టీలు, ప్రముఖులు కూడా ఇఫ్తార్లు ఇస్తున్నారు.. ఇక, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇఫ్తార్ విందులు ఇస్తూ వస్తున్నాయి.. ఈ రోజు విజయవాడ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది.. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రానున్నారు.. ప్రభుత్వ ఇఫ్తార్ విందు నేపథ్యంలో బెజవాడలో ఈ రోజు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.. సాయంత్రం 4 గంటల…
Yerragondapalem: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. స్థానిక ఇజ్రాయెల్ పేటలో ఇరువర్గాల ఘర్షణకు దిగాయి.. దీంతో మహిళలు సహా పది మందికి పైగా గాయాలయ్యాయి. గ్రామంలోని పోలేరమ్మ ఆలయానికి ముందు కాలనీ పేరిట ఆర్చి నిర్మానానికి ఏర్పాట్లు చేయటంతో వివాదం తలెత్తింది. ఆర్చి నిర్మాణాన్ని మరో వర్గం వ్యతిరేకిస్తుండటంతో ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై దాడికి యత్నించారు.. రాళ్ళ దాడిలో కానిస్టేబుల్ కి తీవ్రగాయలు కావటంతో హాస్పిటల్ కి…
ఉత్తరప్రదేశ్లోని శ్రావస్తి జిల్లాలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. పోలీసులు మృత దేహాలను పోస్టుమార్టం కోసం పంపి, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బహ్రైచ్కు తరలించారు.