మన సంప్రదాయంలో అనేక రకాల ఉత్పవాలు జరుగుతుంటాయి. అందులో కొన్ని విచిత్రంగా, నవ్వు తెప్పించేవిగా ఉంటే.. మరికొన్ని ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటాయి. ప్రకాశంలో జరిగే కంపకల్లి ఉత్సవం గురించి చర్చించుకుంటున్నారు. జిల్లాలోని హనుమంతునిపాడు మండలం చిన్న గొల్లపల్లిలో కంపకల్లి ఉత్సవం ఒకటి జరుగుతూ ఉంటుంది. కంపకల్లి ఉత్సవంలో భాగంగా ముళ్ళ కంపలపై పొర్లి మొక్కులు తీర్చుకుంటారు భక్తులు..అదేంటి ముళ్ళ కంపలంటే ముళ్ళు గుచ్చుకుంటాయి కదా.. చిన్న ముల్లు గుచ్చుకుంటేనే మంట పుడుతుంది. అలాంటిది ముళ్ళ కంపలపై పొర్లడం ఏంటని అనుకుంటున్నారా. అంతేమరి.. అక్కడ సంప్రదాయాన్ని తు.,చ తప్పకుండా పాటిస్తారు. చిన్నపిల్లల్ని కూడా పొర్లిస్తారు.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
అయితే ఈసారి 14 సంవత్సరాల లోపు చిన్నారులను ముళ్ళ కంపలపై దొర్లించకుండా భక్తులకు అవగాహన కల్పించారు ఐసిడిఎస్, పోలీస్ అధికారులు..చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా కంపకల్లి ఉత్సవం జరుగుతుంటుంది. చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఈ ఉత్సవం చూడడానికి జనం వస్తుంటారు. కరోనా అనంతరం మూడేళ్ల తర్వాత ఉత్సవాలు నిర్వహించటంతో భారీగా తరలి వచ్చారు భక్తులు… కంపకల్లి ఉత్సవంలో ముళ్ల కంపలపై పొర్లాడితే తమ కోరికలు తీరతాయని, కష్టాల నుంచి గట్టెక్కుతామంటున్నారు అక్కడి జనం.
Read Also: Chalapathi Rao: యన్టీఆర్ నుండి చలపతిరావు నేర్చుకున్నదేంటి!?