రోజురోజుకు మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎటు చూసిన ఎదో ఒక అబద్ధపు ప్రచారంతో మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. అలాంటి వారిని పోలీసులు కఠినంగ శిక్షించిన కూడా వారిలో మార్పులు మాత్రం రావడం లేదు. దేశంలో చాలా చోట్ల ఇలాంటి మోసాలు వెలుగులోకి వస్తునే ఉన్నాయి. అయితే, తాజాగా చెన్నై మహానగరంలో కూడా ఓ కన్నింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read : Business Headlines 08-05-23: ‘విశాఖ’.. విశేషం. మరపురాని ఏప్రిల్ మాసం
చెన్నై మహానగరంలో మాయగాళ్లు రెచ్చిపోతున్నారు. ధనవంతులైన యువకులే టార్టెట్ గా ఈ ముఠా పని చేస్తుంది. దీంతో నగ్నంగా కనిపించే కూలింగ్ గ్లాస్ లు అంటూ మోసాలకు దిగారు. ఈ గ్లాస్ లు పెట్టుకోవడం వల్ల ఎవరైన మీకు నగ్నంగా కనిపిస్తారని వారిని నమ్మించి వారికి ఒక్కో గ్లాస్ ను లక్షల రూపాయలకు ఈ కూలింగ్ గ్లాస్ లను మోసగాళ్లు విక్రయించారు.
Also Read : Award winning Director: ‘సర్కిల్’ చుడుతున్న నీలకంఠ!
ఈ ఘటన చెన్నై మహానగరంలోని కోయంబేడులో జరిగింది. కోయంబేడులో అనుమానస్పదంగా కనిపించిన ఓ కేరళ ముఠాకు చెందిన నలుగుర యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో బెంగళూరుకు చెందిన శివ, కేరళకు చెందిన కుబైట్, జిత్తు, ఇర్షాద్ లుగా గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు యువకులతో పాటు కూలింగ్ గ్లాస్ లతో పాటు పుల్లింగ్ చేసే సామగ్రి, గన్, బుల్లెట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి అబద్దాపు ప్రచారాలను నమ్మి మోసపోవద్దంటూ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.