తూర్పు గోదావరి జిల్లా రాజానగరం పోలీసులు అక్రమ గంజాయి నిల్వ ఉంచి ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్న భార్యాభర్తలు, వీరికి సహకరిస్తున్న మరో ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి ఒక వ్యాన్, కారు, రెండు మోటారు సైకిల్లను, రేకుల షెడ్ సీజ్ చేసినట్లు తెలిపారు. గంజాయి కేసుకు సంబంధించిన వివరాలను రాజమండ్రి నార్త్ జోన్ డిఎస్పీ వై. శ్రీకాంత్ వెల్లడించారు. రాజానగరం మండలంలో కొండగుంటూరు కొండాలమ్మ గుడి సమీపంలో ప్రైవేట్ లే అవుట్…
హైకోర్టు ఆదేశాలను పోలీసులు అమలు చేయడం లేదని మండిపడ్డారు కేతిరెడ్డి పెద్దారెడ్డి.. నేను తాడిపత్రి వెళ్తే.. భద్రత కల్పించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.. విశాఖలో ప్రధాన మంత్రి పర్యటన ఉందని.. భద్రత కల్పించలేమని ఎస్పీ జగదీష్ వివరణ ఇస్తున్నారు. ఇప్పటికే ఏడెనిమిది సార్లు నేను తాడిపత్రి పర్యటన వాయిదా వేసుకున్నా.. నాకు తాడిపత్రి లో సొంత ఇళ్లు ఉంది.. నా ఇంటికి నేను వెళ్తానంటుంటే పోలీసులు అడ్డుపడుతున్నారని ఫైర్ అయ్యారు..
ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లోని మల్కన్గిరి జిల్లా పోలీసులు కీలకమైన మావోయిస్టులను అరెస్టు చేశారు. మావోయిస్టు పార్టీ కంగేరి ఘాటి ఏరియా కమిటీ సభ్యుడు కేసా కవాసి, ఏవోవీ మిలటరీ ప్లాటును కమిటీ సభ్యుడు, ఏరియా కమిటీ సభ్యుడు రాకేష్ సాను కుంజమ్ లను అరెస్ట్ చేశారు..
KTR: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Phone Tapping Case: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు వచ్చాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీజేపీ నేతలే టార్గెట్ గా పని చేసినట్లు తెలుస్తుంది.
డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ (ఈడీ) హైదరాబాద్ జోన్ కార్యాలయం, అగ్రి గోల్డ్ గ్రూప్ కంపెనీలు నడిపిన పొంజీ స్కీమ్ బాధితులకు సంబంధించి రూ. 611 కోట్ల విలువైన ఆస్తులను పునరుద్ధరించడం ద్వారా మరోసారి విజయాన్ని సాధించింది. అటాచ్ మెంట్ సమయంలో వీటి విలువ రూ.611 కోట్లు కాగా, ప్రస్తుత మార్కెట్ విలువ రూ.1000 కోట్లు మించిపోయే అవకాశం ఉంది. ఈ ఏడాది మే నెలలో ఈడీ, మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) 2002 సెక్షన్ 8(8) కింద…
బెదిరింపు కాల్ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయ లక్ష్మీకి వస్తే ఇమీడియట్ గా ఆ ఫోన్ చేసిన వ్యక్తికి అరెస్టు చేస్తారు.. కానీ, ఒక్క సిట్టింగ్ ఎమ్మెల్యేకి బక్రీదు పండగ కంటే ముందు నుంచి ఇప్పటి వరకు వందల ఫోన్ కాల్స్.. వేరే వేరే నంబర్ల నుంచి బెదిరింపు కాల్ వస్తే మాత్రం ఒక్క ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు ఆలోచన చేస్తున్న పోలీస్ అధికారులు అని మండిపడ్డారు.
NTR జిల్లా మైలవరంలో విషాదం నెలకొంది.. ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు ఓ మంత్రి.. మృతులు హిరణ్య (9), లీలసాయి (7)గా గుర్తించారు.. అయితే, రెండు నెలల కిందట పిల్లలను తన భర్త రవిశంకర్ వద్ద వదిలి వెళ్లిందట తల్లి చంద్రిక.. దీంతో, తీవ్ర మనస్తాపానికి గురై.. ఆత్మహత్య చేసుకుందామని భావించి ఉంటాడని.. తన పిల్లలను ఎవరు పోషిస్తారనే వారిని కూడా హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు.