అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు అరెస్టు చేయడంతో అన్నమయ్య జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమయింది. ఒకపక్క రాయచోటి పట్టణంలోని పలు బహిరంగ ప్రదేశాలలో పోలీసులు గస్తీ కాస్తుండగా, మరోపక్క టెర్రరిస్టుల భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.
JC Prabhakar Reddy: రప్పా రప్పా అనే డైలాగ్ తాడిపత్రి పట్టణానికి పాకింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెంట తిరగొద్దంటూ వైసీపీ కార్యకర్తలకు ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తాడిపత్రి పట్టణానికి దొంగ చాటున వచ్చాడు కేతిరెడ్డి.. అయితే, నాకు వైఎస్ఆర్ పార్టీ శత్రువు కాదు మా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే అన్నారు.
ఎన్టీవీతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ.. పోలీసులను అడ్డం పెట్టుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నాడు.. పార్టీ కార్యక్రమాలు చేయకుండా ఏడాది కాలంగా నియోజవర్గానికి దూరంగా ఉన్నాను అని పేర్కొన్నారు. తాడిపత్రి పట్టణానికి వెళ్లిన గంటలోపే పోలీసులు నన్ను పంపించేశారు..
Mahua Moitra: పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో లా స్టూడెంట్ పై జరిగిన అత్యాచార ఘటన సంచలనం రేపుతుంది. ఈ క్రమంలో బాధితురాలిదే తప్పంటూ అధికారిక టీఎంసీ నేతలు చేస్తున్న కామెంట్స్ ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా తీవ్రంగా మండిపడింది.
Tension in Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. ఏడాది తర్వాత తాడిపత్రి పట్టణంలోకి వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రవేశించాడు. కేతిరెడ్డి హఠాత్తుగా తన సొంత ఇంట్లో ప్రత్యక్షం కావడంపై పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.
Ivory Smugglers: హైదరాబాద్ నగరంలో పట్టుబడిన ఏనుగు దంతాల కేసులో విచారణను వేగవంతం చేశారు. 2023లో భాకరాపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులో చోరికి గురైన ఏనుగు దంతాలుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అన్నమయ్య జిల్లాకు చెందిన రేకులగుంట ప్రసాద్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.
తన భార్య గురించి తప్పుగా మాట్లాడాడంటూ స్నేహితుడిపై కత్తితో దాడి చేశాడో భర్త.. తన భార్యపై మాట్లాడిన మాటలు జీర్ణించుకోలేక క్షణికావేశంలో.. చికెన్ కొట్టే కత్తితో స్నేహితుడి మెడపై దాడి చేయడంతో.. అతడి పరిస్థితి విషమంగా మారింది.. ఈ ఘటన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కలకలం సృష్టించింది..
బీపార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో కొనసాగుతోన్న మిస్టరీ.. 17 ఏళ్ల క్రితం ఆయేషా మీరా హత్యకు గురికాగా ఇంకా నిందితులు ఎవరనే సస్పెన్స్ కొనసాగుతోంది.
Swetcha’s father: ప్రముఖ టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్యపై ఆమె తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురు ఇలా చేసుకోవడానికి పూర్ణ చందర్ అనే వ్యక్తి కారణమని ఆరోపించారు. గత 3 సంవత్సరాల నుంచి నా కూతురు వెంట పూర్ణచంద్రరావు పడ్డాడు.. పూర్ణచందర్ వేధింపుల వల్లనే నా కూతురు ఆత్మహత్య చేసుకుంది.
Fake Caste Certificate Scam: సంగారెడ్డి జిల్లాలో నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులే లక్ష్యంగా ఈ దాందా కొనసాగుతుంది. ఒక్కో సర్టిఫికేట్ ని 10 వేల నుంచి 20 వేల రూపాయలకు అమ్ముకుంటున్నట్టు సమాచారం.