Criminals in Beggars: షాకింగ్..! బిచ్చగాళ్ల ముసుగులో క్రిమినల్స్..
- నంద్యాలలో బిచ్చగాడు దస్తగిరి హత్య..
- పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు..
- 120 మంది బిచ్చగాళ్ల వివరాలు సేకరణ..
- 30 మందికి నేరచరిత్ర ఉన్నట్లు పోలీసులకు నివేదిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Criminals in Beggars: బిచ్చగాడు అనే సినిమా తక్కువ బడ్జెట్‌తో వచ్చి బిగ్ హిట్ అందుకుంది.. అయితే, తన తల్లి ఆరోగ్యం బాగుపడాలని, ఆమె ప్రాణాలు నిలవాలని.. ఓ కొడుకు బిచ్చగాడిగా మారిపోతారు.. తల్లి ఆరోగ్యం కుదుటపడిన తర్వాత తిరిగి వస్తాడు.. ఇక, బిచ్చగాళ్లకు కొదవలేదు.. గుడి దగ్గర వీరి సంఖ్య రోజురోజుకీ విపరీతంగా పెరిగిపోతుందనే చెప్పాలి.. మరోవైపు, ప్రధాన కూడళ్లలో.. సిగ్నల్ పడగానే వివిధ రకాల బిచ్చగాళ్లు వచ్చి వాహనదారులను యాచిస్తుంటారు.. వీరిలో కొందరు నిజంగానే కొందరు శారీరక, మానసిక వ్యాధులతో బాధపడేవారు ఉంటే.. మరికొందరు మాత్రం.. యాక్షన్ చేస్తూ కూడా డబ్బులు, వస్తువులు అడుగుతుంటారు.. ఇక, హోటళ్ల దగ్గర కూడా అడుక్కునేవారు లేకపోలేదు.. అయితే, ఇదంతా ఇప్పుడు ఎందుకంటే.. వాళ్లు బిచ్చగాళ్లు మాత్రమే కాదు.. బిచ్చగాళ్ల ముసుగులో క్రిమినల్స్ కూడా ఉండొచ్చు.. నేరాళు చేసి.. తప్పించుకుని తిరుగుతూ.. బిచ్చగాడి అవతారం ఎత్తి ఉండొచ్చు..
Read Also: Minister Komatireddy: కేసీఆర్ అసెంబ్లీకి రావాలి.. హరీష్ రావు, కేటీఆర్ లెక్కలోకి రారు..
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
ఇప్పుడు నంద్యాల జిల్లాలో జరిగిన బిచ్చగాడు దస్తగిరి హత్య.. ఎంతో మంద్రి క్రిమినల్స్ బిచ్చగాళ్ల రూపంలో తిరుగుతున్నారనే సంచలన విషయాన్ని బయటపెట్టింది.. బిచ్చగాళ్ల ముసుగులో కొందరు క్రిమినల్స్ తిరుగుతున్నారు.. వీరికి షెల్టర్ జోన్లుగా రైల్వే స్టేషన్, ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు మారిపోయాయి.. బిచ్చగాడు దస్తగిరి హత్య తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు.. బిచ్చగాళ్లను విచారించారు.. బిచ్చగాళ్ల ఫింగర్ ప్రింట్స్ సేకరించి, టెక్నికల్ సిబ్బందికి పంపించారు.. దీంతో, షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి.. 120 మంది బిచ్చగాళ్లలో 30 మందికి నేరచరిత్ర ఉన్నట్లు పోలీసులకు నివేదిక అందింది.. డేటా సేకరించి పోలీసులు.. వారిని మందలించి పంపినట్టుగా తెలుస్తోంది.. దీంతో, ఆయా ప్రాంతాల్లో పోలీస్ పికెట్, సీసీ కెమెరాలు, ఫ్లడ్ లైట్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించారు పోలీసులు..
Read Also: Minister Komatireddy: కేసీఆర్ అసెంబ్లీకి రావాలి.. హరీష్ రావు, కేటీఆర్ లెక్కలోకి రారు..
కాగా, మద్యం మత్తులో వంద రూపాయల నోటు ఇవ్వలేదని బిచ్చగాడుని బండరాయితో మోది, దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు.. నంద్యాలలోని నూనెపల్లె ఫ్లై ఓవర్ బ్రిడ్జి దిగువ జరిగిన దస్తగిరి అనే బిచ్చగాడి హత్య కేసు మిస్టరీగా మారగా.. ఆ మిస్టరీని ఛేదించారు త్రీ టౌన్ పోలీసులు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అవుకు మండలం కొండమాయ పల్లెకు చెందిన దస్తగిరికి ఇద్దరు భార్యలు, నలుగురు కుమారులు వున్నారు. వీరితో గొడవ పడి, నంద్యాలకు వచ్చి, రైల్వే స్టేషన్, నూనెపల్లె, నూనెపల్లె ఫ్లై ఓవర్ బ్రిడ్జి దిగువ భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు దస్తగిరి.. అయితే, సిరివేళ్లకు చెందిన రహ్యుం జులాయిగా పని పాట లేకుండా తాగి తిరిగేవాడు. ఈ క్రమంలో నంద్యాలకు వెళ్లి సాయిబాబా నగర్ సెంటర్ లోని వైన్స్ లో తప్పతాగి, అక్కడే పడిపోయాడు. ఇక, రెండు గంటల తర్వాత లేచి, నూనెపల్లె ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రాంతానికి వెళ్లాడు.. అర్ధరాత్రి దగ్గర్లోనే నిద్రపోతున్న దస్తగిరిని లేపి, తాగడానికి డబ్బు ఇవ్వమని బెదిరించాడు రహ్యుం. కానీ, దస్తగిరి ఇవ్వకపోవడంతో జేబులో ఉన్న వంద రూపాయల నోటును లాక్కోబోయాడు. దీంతో, ఇద్దరి మధ్యన ఘర్షణ జరిగింది.. ఆవేశంతో ఊగిపోయిన రహ్యుం.. బండరాయితో దస్తగిరి తలపై మోది వెళ్లిపోయాడు.. ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పుడు నంద్యాల పోలీసులు షాకింగ్ విషయాలు బయటపెట్టారు.
తాజావార్తలు
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
-
Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
-
Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
-
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!