YS Jagan Mohan Reddy: చిత్తూరు జిల్లాలో ఈ నెల 9వ తేదీన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. బంగారుపాళ్యం మ్యాంగో మార్కెట్ యార్డు చిన్నది కావడంతో కేవలం 500 మందికి మాత్రమే పర్మిషన్ ఇస్తున్నామని తెలిపారు. అలాగే, ఇప్పటికే హెలిప్యాడ్ కు అనుమతిచ్చిన చిత్తూరు పోలీసులు.. హెలిపాడ్ వద్ద 30 మందికి అనుమతి ఉంటుంది.. ఎలాంటి ర్యాలీలు, రోడ్ షోలు, ఇతర కార్యక్రమాలకు అనుమతి లేదు అన్నారు.
Read Also: HYDRA: దారికి అడ్డంగా కట్టిన గోడ తీస్తే 3.. మూస్తే 8 కిలోమీటర్లు..
అయితే, మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. గతంలో జగన్ పర్యటనలో చోటు చేసుకున్న అపశృతులను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. బంగారుపాళ్యంలో జగన్ పర్యటిస్తున్న ప్రాంతంలో పెట్రోల్ బంకులు, పాఠశాలలు ఉన్నందున సమయపాలన పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. జగన్ కు అవసరమైతే రోప్ పార్టీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.