తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. 2014 జూన్ రెండవ తేదీ వరకు తెలంగాణ ఉద్యమకారుల మీద ఉన్న కేసుల వివరాలు అందజేయాలని అన్ని జిల్లాల ఎస్పీలను కమీషనర్లను తెలంగాణ డీజీపీ ఆదేశించారు. అంతేకాకుండా.. 2009 మలిదశ తెలంగాణ ఉద్యమం నుంచి 2014 జూన్ రెండవ తేదీ వరకు నమోదైన అన్ని కేసుల వివరాలు సమర్పించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో.. త్వరలోనే తెలంగాణ ఉద్యమకారుల కేసులను…
ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. పెళ్లి ఊరేగింపు చూసేందుకు వెళ్లిన అమాయక బాలికపై గుర్తు తెలియని యువకుడు అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో బాలిక ముఖం, ప్రైవేట్ భాగాలపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.
ఉత్తర ప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. సహరాన్‌పూర్‌లోని పోష్ కాలనీలో.. ఓ యువకుడిని స్థానికులు స్తంభానికి కట్టి దారుణంగా కొట్టారు. దొంగతనం చేశాడనే ఆరోపణలపై కర్రలతో చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.. అయితే బాధితుడిని కొట్టిన వ్యక్తుల కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో ఆదివారం హత్యా ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కొడవలితో మరో వ్యక్తిని పలుమార్లు నరికి చంపాడు. ఈ ఘటనకు సంబంధించి అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డైంది. నిందితుడు మాత్రం ఏ మాత్రం భయం, బెరుకు లేకండా బాధితుడిపై దాడికి దిగాడు. కాగా.. కొడవలితో దాడి చేస్తున్నప్పుడు స్థానికులు ఆపకుండా, ఫోన్లలో ఈ దాడిని మొత్తం వీడియో తీశారు.
కొమురం భీం జిల్లా కేంద్రంలో తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ నాయకులు తమపై దాడులు చేస్తున్నారని తెలిపారు. నిన్న జరిగిన బూత్ నెం.90లో.. బీఆర్ఎస్ నేతలు ఒక వ్యక్తి కూర్చుని పెట్టి మరీ రిగ్గింగ్ కు పాల్పడుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆరోపించారు. మొదటి నుండే చెబుతున్నా.. ఇక్కడి పోలీసుల మీద నమ్మకం లేదని.. నిన్న తమపై దాడులకు…
కర్ణాటక రాజధాని బెంగళూరులోని దాదాపు 15 పాఠశాలలకు ఇవాళ ఉదయం బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాఠశాలలన్నింటిని ఖాళీ చేయాలని పోలీసులు తెలిపారు.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో విచిత్రమైన దొంగతనం జరిగింది. కాశాంబి జిల్లాలోని ఉజ్జయిని గ్రామంలో 10 టన్నుల బరువున్న 50 మీటర్ల (సుమారు 164 అడుగులు) సెల్ ఫోన్ టవర్ ను దుండగులు దొంగలించారు. అయితే, మార్చి 31వ తేదీ నుంచి టవర్ కనిపించడం లేదని టెక్నీషియన్ రాజేష్ కుమార్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Telangana Elections 2023: ఎన్నికలలో ప్రజలను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు రకరకాల వాగ్దానాలు చేస్తుంటాయి. అనేక పార్టీలు డబ్బు, మద్యంతో ప్రజలను మభ్యపెడుతుంటాయి.
నెల్లూరు జిల్లా పెంచలకోన జలపాతం దగ్గర తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మొత్తం పదకొండు మంది యాత్రికులు గల్లంతయినట్లు సమాచారం. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. వరద ఉధృతికి పదకొండు మంది పర్యాటకులు కొట్టుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.