హైదరాబాద్ నగరంలో రోడ్డు మీద వెళ్లే వారిని లిఫ్ట్ అడగి వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ఓ కిలాడీ లేడీని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వివరాల్లోకి వెళితే.. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి కేబీఆర్ పార్క్ దాకా లిఫ్ట్ కావాలి అంటూ ఈ కీలాడి లేడీ కారులో ఎక్కింది. వాహనంలో ఎక్కిన తర్వాత రేప్ చేసేందుకు ట్రై చేశావు అంటూ బెదిరించి డబ్బులు గుంజుతుంది.. తాను అడ్వకేట్ ను.. తనకు అన్ని సెక్షన్లు తెలుసు అంటూ దబాయింపులకు పాల్పడింది.. దీంతో బాధిత డ్రైవర్ పరమానంద జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Read Also: Car Sales: కార్‌లను తెగ కొంటున్న భారతీయులు.. 2023లో రికార్డ్ సేల్స్..
ఇక, రంగంలోకి దిగిన పోలీసులు సదరు మహిళపై ఐపీసీ 389 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ కిలాడీ సయీదా నయీమా సుల్తానాను జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కిలాడీ లేడీ మీద నగర వ్యాప్తంగా పలు స్టేషన్లలో 17 కేసులు ఉన్నాయి. నిందితురాలు దగ్గర వందలాది కేసులకు సంబంధించిన కేస్ స్టడీస్ వివరాలు లభించాయి. వాటిని అడ్డు పెట్టుకుని ప్రతి కేసులో ఎలాంటి శిక్ష పడుతుంది అని బాధితులను కిలాడి లేడీ బెదిరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పలువురు అమాయకుల మీద ఈ కిలాడీ లేడీ కేసులు పెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది.