Nirmal Crime: గుట్కా గొడవ ప్రాణం తీసింది. కళ్లు తాగిన తర్వాత గుట్కా కోసం జరిగిన గొడవలో.. కేవలం ఐదు రూపాయల గుట్కా ఓ ప్రాణాన్ని తీసింది.. ఆ ఘటనకు సంబంధిచిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పల్సి గ్రామానికి చెందిన లాలాజీ రమేష్, పురం శెట్టి యోగేష్.. ఇద్దరు కలసి తెల్ల కళ్ళు తాగారు. గ్రామంలో బట్టిలో తాగి బయటకు వచ్చే సమయంలో యోగేష్ ని రమేష్ గుట్కా అడగాడు. యోగేష్ ఇవ్వకపోవడంతో అదే విషయం మనసులో పెట్టుకొని ఎప్పుడు అడిగినా గుట్కా ఇవ్వవని రమేష్ ఎలాగైనా చంపుతానని తిట్టసాగాడు.. ఆ తర్వాత గుండె భాగంలో పిడుగులు గుద్దగా.. యోగేష్ సృహ తప్పి కిందికి పడిపోయాడని స్థానికులు తెలిపారు.. ఆటు వైపు వెల్తున్న యోగేష్ అమ్మ గొడవను గమనించి కింద పడ్డ అతన్ని గ్రామంలో ఉన్న ఆర్ఎంపీ వద్దకు చికిత్స నిమిత్తం తీసుకెళ్లగా అతను మెరుగైన చికిత్స కోసం బైంసాకు పంపారు.. అయితే, భైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే చనిపోయాడని డాక్టర్ నిర్ధారించారు.
Read Also: Telangana Congress: ఒక్క ఛాన్స్ ప్లీజ్..! కాంగ్రెస్‌లో ఎంపీ సీటు కోసం భారీగా దరఖాస్తులు..
కాగా, గ్రామాల్లో విచ్చల విడిగా తెల్లకల్లు బట్టీలు వెలిశాయి.. అలాంటి బట్టి వద్ద తాగిన మత్తులు గొడవలు సర్వసాధారణం అయ్యాయి.. గొడవలు జరిగినా న్యూసెన్సు జరుగుతున్నా ఎవ్వరు పట్టించుకునే వారు లేరు.. పైగా బట్టీల వ్యాపారం చేసే వారితో కొంతమంది కుమ్మక్కు కావడం అక్కడేం జరిగినా బయటకు రావడం లేదు అంటున్నారు స్థానికులు.. తాజాగా జరిగిన వ్యక్తి హత్య తాగిన మత్తులో జరగడం వివిధ రకాల చర్చకు దారితీస్తుంది.. బట్టిలో తెల్లకళ్లు తాగి బయటకు వచ్చాక గొడవ జరిగిందని మృుతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు పిర్యాదు చేశారు.. దీన్ని ఆధారంగా యోగేష్ మృతికి కారణం అయిన రమేష్ ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. మరోవైపు, నిర్మల్ జిల్లాతోపాటు ఆదిలాబాద్ జిల్లాలో తెల్లకళ్లు బట్టీల విచ్చలవిడి నిర్వాహణ తాగి మైనకం లో గొడవలు తరుచూ జరుగుతున్నాయి.. ఎక్కడో ఒక్కటి బయటకు వచ్చినా దాన్ని బట్టి నిర్వహకులతో మిలాకత్ అయిన సంబందించిన శాఖ లేదా పోలీసులు వెలుగులోకి రాకుండా తొక్కిపెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.