MRO Ramanaiah Murder Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎమ్మార్వో హత్య కేసులో నిందితుడిగా ఉన్న మురారి సుబ్రమణ్యం గంగారాంని అరెస్ట్ చేశారు పోలీసులు.. హత్య జరిగిన తర్వాత రోజు తెల్లవారుజామున వరుకు నిందితుడు విశాఖలోనే ఉన్నట్టు పోలీసులు గుప్పించారు.. ఆ తర్వాత విశాఖ నుంచి విమానంలో బెంగళూరు పరారయ్యాడు.. అయితే, ఈ రోజు ఎగ్మురు రైల్వే స్టేషన్ లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. హత్య కేసులో నిందితుడు పై సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఓ కేసు నమోదు అయినట్టు విశాఖ పోలీసులు గుర్తించారు. రెండేళ్ల క్రితం హైదరాబాద్ నుంచి విశాఖకి వెళ్లాడు నిందితుడు. విశాఖలోని పనోరమా హిల్స్ లో నివాసం ఉంటూ.. రియల్‌ఎస్టేట్ లావాదేవీలు చేస్తునట్టు గుర్తించారు. ఓ అపార్ట్ మెంట్ నిర్మాణం విషయంలో 22/A లోకి వెళ్లి విషయంలో రమణయ్యకి నిందితుడుకి పరిచయం ఏర్పడింది.. కొందరి యాజమానుల వద్ద నుంచి 57 లక్షల రూపాయల వరకు నిందితుడు వసూలు చేసినట్టుగా పోలీసులు చెబుతున్నారు.. ఆ 57 లక్షలు తీసుకొని కూడా పని చేయకపోవడంతో రమణయ్య ని హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు.
Read Also: Minister Jogi Ramesh: వసంత కృష్ణప్రసాద్‌పై జోగి రమేష్ కౌంటర్ ఎటాక్.. జగన్ మాటే నాకు ఫైనల్..!
మీడియాతో మాట్లాడిన విశాఖ సీపీ రవి శంకర్.. ఎమ్మార్వో హత్య కేసులో నిందితుడిని చెన్నైలో అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. చెన్నై శివారులో స్పెషల్ టీమ్ టెక్నికల్ అవిడెన్స్ తో పట్టుకుందన్నారు. మొత్తం 10 టీమ్స్ నిందితుడు కోసం గాలించాయి.. నిందితుడు మురారి సుబ్రహ్మణ్యం గంగారం.. పేరు పెద్దగా ఉండడం వల్ల మిస్ కమ్యూనికేషన్ తో పట్టుకోవడంలో ఆలస్యం అయ్యిందన్నారు. విశాఖ నుండి చెన్నైకు వయా బెంగుళూరు టికెట్ బుక్ చేసుకున్నాడు.. బెంగళూరులో ఇతని పూర్తి పేరు అనౌన్స్ చేయడంతో అలెర్ట్ అయి.. ఎయిర్‌పోర్ట్ నుంచి బస్సులో చెన్నై బయలుదేరాడు.. చెన్నై చెంగల్ పేట్ దగ్గర మా టీం అతడిని పట్టుకుందని వెల్లడించారు. ప్రస్తుతం నిందితుడుని క్షుణ్ణంగా పరిశీలించి, విచారణ జరుపుతాం.. లాండ్, ఆర్ధిక లావా దేవీలు కారణంగా ఈ హత్య చేసినట్టు తెలుస్తుందన్నారు. కేసు రీ ఇన్వెస్ట్‌గేషన్ చేసి హత్యకు ప్రధాన కారణాలు, వాస్తవాలు వెల్లడిస్తాం అన్నారు. నిందితుడు ఓ ప్రయివేట్ రియల్ ఎస్టేట్ కంపెనీకి మేనేజర్ గా పని చేస్తున్నాడు.. విజయవాడ, సైబరాబాద్ లో ఇతనిపై చీటింగ్ కేసులు ఉన్నాయి.. ఎమ్మార్వో హత్య కేసుకు సంబంధించి కీలకమైన 3 ఫైల్స్ స్వాధీనం చేసుకున్నాం… హత్య జరిగిన మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలవరకు విశాఖ ఎయిర్పోర్ట్ లోనే నిందితుడు ఉన్నాడని వెల్లడించారు విశాఖ సీపీ రవి శంకర్.