Karnataka: నవమాసాలు మోసి కని పెంచి కళ్ళల్లో పెట్టుకొని చూసుకునే అమ్మ మనసు కల్మషం లేనిది. కానీ అలాంటి తల్లిని ఎవరైనా చంపాలనుకుంటారా? ఊహించుకోడానికే మనసు ఒప్పుకోదు.. అలాంటిది దుర్మార్గుడైన కొడుకు తన తల్లిని ఇనుప రాడ్డుతో కొట్టి చంపేశాడు. రక్తపుమడుగులో ఆ తల్లి విలవిలలాడుతు ఉంటే చూస్తూ ఆలాగే నిలబడి చూశాడు ఆ కసాయి కొడుకు.. ఈ దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని ముల్‌బాగల్ పట్టణంలో చోటు చేసుకుంది.
Read Also: Siddharth Anand: 90% మంది ఇండియన్స్ ఫ్లైట్ ఎక్కలేదు అందుకే నా సినిమా ఆడలేదు…
అయితే, తాజాగా, కర్ణాటక రాష్ట్రంలోని ముల్‌బాగల్ పట్టణంలో టిఫిన్ పెట్టలేదని ఓ బాలుడు తన తల్లిని చంపేశాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని నేరుగా పోలీస్ స్టేషన్ కు అక్కడ ఉన్న పోలీసులకు తెలియజేశాడు. ఇక, అప్రమత్తమైన పోలీసులు వెంటనే బాలుడి ఇంటికి వెళ్లి చూడగా.. రక్తపుమడుగుల్లో ఉన్న మృతదేహన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకోని ఆరా తీయగా.. బాలుడికి తన తల్లి అల్పాహారం పెట్టామని అడిగాడు.. దానికి ఆమె నిరాకరించింది.. దీంతో కోపంతో ఊగిపోయిన ఆ మైనర్ బాలుడు ఇనుప రాడ్‌తో తన తల్లి తలపై కొట్టడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది అని వెల్లడించారు. బాలుడిని అరెస్ట్ చేసి జూవైనల్ కోర్టులో హాజరు పర్చారు.