HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ జులై 23న బుధవారం రాత్రి 9.30 గంటలకు ప్రీమియర్స్ షోలు వేస్తున్నారు. నైజాం ఏరియాలో ఎక్కువగా హైదరాబాద్ లోనే ఈ షోలు పడుతున్నాయి. సినిమాలకు ఫేమస్ అయిన ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ వద్ద పవన్ ఫ్యాన్స్ భారీగా చేరుకున్నారు. థియేటర్ ముందు హంగామా నెలకొంది. దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. పుష్ప-2 ఘటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా…
Saraswati Pushkaralu : తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలు రెండో రోజుకు చేరుకున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ముఖ్యంగా కాళేశ్వరంలో భక్తుల సందడి నెలకొంది. ఇక్కడ గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మొదటి రోజు లక్ష మందికి పైగా భక్తులు పుష్కర స్నానాలు చేసినట్లు అధికారులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం కాళేశ్వరంలో కుంభమేళాను తలపించేలా టెంట్ సిటీని ఏర్పాటు చేశారు. భక్తులు నదిలో స్నానాలు ఆచరించడానికి ప్రత్యేక…
వీర హనుమాన్ విజయ యాత్రకు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తాం.. రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల నుంచి కూడా ఈ విజయ యాత్రలో పాల్గొంటారు.. సుమారు 12 కిలో మీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది.. సెన్సిటివ్ ఏరియాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటాం: సీపీ సీవీ ఆనంద్
సీతారాంబాద్ ఆలయం నుంచి శ్రీరాముడి శోభాయాత్ర ప్రారంభమైంది. భక్తుల జన సందోహం మధ్య శోభాయత్ర సాగుతోంది. జైశ్రీరామ్ నినాదాలతో సీతారాంబాద్ ఆలయ పరిసరాలు మార్మోగుతున్నాయి. సీతారాంబాగ్ ఆలయం నుంచి కోటి వ్యాయామ శాల వరకు శోభాయాత్ర సాగనుంది. శ్రీరాముని శోభాయాత్ర భద్రత విధుల్లో 20 వేల మంది పోలీస్ సిబ్బంది ఉన్నారు.. ఈ శోభాయాత్ర సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పలు కీలక సూచనలు చేశారు.
ఈ రోజు శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్ నగరంలో భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహించనున్నారు. మంగళ్ హాట్ సీతారాం భాగ్ నుంచి ప్రారంభం కానున్న ఈ శోభాయాత్ర మధ్యాహ్నం 1 గంటకు ర్యాలీగా బయలుదేరనుంది. సీతారాం భాగ్ నుంచి ప్రారంభమై సుల్తాన్ బజార్ లోని హనుమాన్ వ్యయం శాలకు శోభాయాత్ర చేరుకోనుంది. మొత్తం 3.8 కిలోమీటర్ల మేర శోభాయాత్ర కొనసాగనుంది. ఈ శోభాయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉండటంతో నగర పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు…
వర్సిటీ భూముల్లో ఐటీ ప్రాజెక్టులు చేపట్టొదంటూ హెచ్‌సీయూ విద్యార్థులు సోమవారం కూడా ఆందోళన చేపట్టారు. ప్రధాన ద్వారానికి ఎదురుగా వందల మంది నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఆదివారం జరిగిన ఆందోళనలో అరెస్టు చేసిన ఇద్దరు పరిశోధక విద్యార్థులను రిమాండుకు తరలించామని పోలీసులు తెలిపారు. కాగా.. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు, నేల బృందం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లనుంది. హెచ్‌సీయూ భూములను వారు…
HYDRA : తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్రంలోని చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా ఈ ప్రక్రియ ద్వారా అక్రమ కబ్జాలపై బుద్ధి చూపిస్తుంది. గత కొన్ని నెలల్లో, చెరువులపై కబ్జాలు చేయడంపై కఠిన చర్యలు తీసుకోవడంతో, వందల ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని, అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. తాజాగా, నెక్నాంపూర్ చెరువులో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని నిర్ణయించారు. అయితే శుక్రవారం.. మణికొండలోని నెక్నాంపూర్ చెరువులో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ హైడ్రా…
Game Changer Pre-Release Event: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా జనవరి 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. జనవరి 2న సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇక ట్రైలర్ మెగా అభిమానులకు విపరీతంగా నచ్చింది. అభిమానుల అంచనాలను రెట్టింపు చేసేలా ఉన్న ట్రైలర్ విడుదల కావడంతో సినిమా విడుదల కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే నేడు (జనవరి 4)వ తేదీన రాజమండ్రి వేదికగా ఈ మెగా ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఈ…
హీరో అల్లు అర్జున్ అరెస్ట్ కు కారణమైన సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు ఇప్పుడు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. పోలీసులు ముందు నుంచి సంధ్య థియేటర్ యాజమాన్యం తమకు సమాచారం ఇవ్వలేదని చెబుతూ వచ్చారు. కానీ ప్రీమియర్ షో కి రెండు రోజుల ముందే అంటే రెండవ తేదీన అల్లు అర్జున్ సినిమా ప్రీమియర్ ఉండే అవకాశం ఉండడంతో పోలీసు భద్రత కోరుతూ సంధ్య థియేటర్ పోలీసులకి రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.…
ఢిల్లీ హైకోర్టుకు బాంబుల బెదింపులు రావడం తీవ్ర కలకలం రేపుతుంది. గుర్తుతెలియని వ్యక్తులు ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులను ఈ- మెయిల్ ద్వారా పంపారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు న్యాయస్థానం దగ్గర కట్టుదిట్టమైన భద్రతాను ఏర్పాటు చేశారు.