సీతారాంబాద్ ఆలయం నుంచి శ్రీరాముడి శోభాయాత్ర ప్రారంభమైంది. భక్తుల జన సందోహం మధ్య శోభాయత్ర సాగుతోంది. జైశ్రీరామ్ నినాదాలతో సీతారాంబాద్ ఆలయ పరిసరాలు మార్మోగుతున్నాయి. సీతారాంబాగ్ ఆలయం నుంచి కోటి వ్యాయామ శాల వరకు శోభాయాత్ర సాగనుంది. శ్రీరాముని శోభాయాత్ర భద్రత విధుల్లో 20 వేల మంది పోలీస్ సిబ్బంది ఉన్నారు.. ఈ శోభాయాత్ర సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పలు కీలక సూచనలు చేశారు.
READ MORE: Bhadrachalam: వైభవంగా శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు..
“శోభయాత్రకు వివిధ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. సీతారాంబాగ్ నుంచి కోటి వ్యాయామశాల వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శోభయాత్ర నిర్వహించేందుకు అన్ని భద్రతాపరమైన ఏర్పాటు చేశాం.. ప్రత్యేకంగా 3.8 కిలో మీటర్ రూట్ లో 250కి పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెంచాం. మహిళా భక్తుల కోసం ప్రత్యేక షి టైమ్స్ ఏర్పాట్లు చేశాం.. రామ భక్తులకి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇతర వ్యక్తులని కించ పరచకుండా శోభయాత్ర కొనసాగించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం..” అని సీవీ ఆనంద్ వ్యాఖ్యానించారు.
READ MORE: Pamban Bridge: పంబన్ బ్రిడ్జ్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ.. జాతికి అంకితం!