Hyderabad CP Anand: పీస్ కమిటీ సభ్యుల కారణంగా హైదరాబాద్ నగరంలో ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుగుతున్నాయని నగర పోలీస్ బాస్ సీవీ ఆనంద్ తెలిపారు. వారం రోజుల క్రితమే శ్రీరామ నవమి శోభ యాత్ర ప్రశాంతంగా జరిగింది.. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేస్తూ.. విజయవంతంగా పూర్తి చేశాం.. ఇప్పుడు వీర హనుమాన్ విజయ యాత్రకు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తాం.. రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల నుంచి కూడా ఈ విజయ యాత్రలో పాల్గొంటారు.. సుమారు 12 కిలో మీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది.. సెన్సిటివ్ ఏరియాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటాం.. యాత్ర నిర్వాహకుల సహకారం కూడా ముఖ్యం అని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.
Read Also: Priyansh Arya: ప్రియాంశ్ ఆర్య 8 బంతులే ఆడాడు.. పంజాబ్ కోచ్ ఆసక్తికర విశేషాలు!
ఇక, ర్యాలీ నిర్వహిస్తున్న నిర్వాహకులు బాధ్యత తీసుకొని, అందరిని సమన్వయం చేసుకుంటూ సాగాలని హైదరాబాద్ సీపీ ఆనంద్ చెప్పుకొచ్చారు. కొత్తవారు ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.. 2010 తరువాత ఎప్పుడు గొడవలు జరగలేదు.. 2010 ముషీరాబాద్, మదన్న పేట్ లలో గొడవలు జరిగాయి.. అలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం.. పోలీసులు, నిర్వాహకులతో అందుబాటులో ఉంటూ యాత్రను ముందుకు తీసుకెళ్తాం.. ఖర్మన్ ఘాట్ నుంచి యాత్ర త్వరగా బయలుదేరేలా సూచించాం.. యాత్ర శనివారం జరుగుతుంది.. రెండవ శనివారం కాబట్టి సెలవు ఉంటుంది.. ట్రాఫిక్ కూడా అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా, యాత్ర నిర్వాహకులు సహకరించాలని సీవీ ఆనంద్ కోరారు.
Read Also: ‘Good Bad Ugly’ : అజిత్‌పై ప్రశంసలు కురిపించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ డైరెక్టర్..
కాగా, బైబిల్ హౌస్ వద్ద రైల్వే బ్రిడ్జ్ దగ్గర గతంలో మాదిరిగా సమస్యలు రాకుండా వేరే మార్గంలో ముందుకు వెళ్ళాలని సీపీ ఆనంద్ సూచించారు. అయితే, శ్రీ రామనవమి సందర్భంగా ఒక ఉల్లంఘన జరిగింది.. కాబట్టి, డీజే వల్ల కలిగే నష్టాలు అందరికి తెలుసు.. నిర్వాహకులు కూడా డీజే విషయంలో నిబంధనలకు అనుగుణంగా సహకరిస్తామన్నారు.. పెద్ద స్పీకర్లు పెట్టుకోవచ్చు కానీ డీజేలను మాత్రం అనుమతించము.. ఇక, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వీడియోలో పెట్టకూడదు.. వర్షం పడే అవకాశం ఉంది.. జీహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికపుడు సమన్వయం చేస్తూ ముందుకు సాగాలన్నారు. వాటర్ లాగిన్ పాయింట్స్ కు ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలి.. అలాగే, రాచకొండ పోలీసులు ఐపీఎల్ మ్యాచ్ ఉందని, మొత్తం తమపై పెట్టొద్దని మనవి.. యాత్ర పూర్తయ్యాక రిటర్న్ అయ్యే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.. జాగ్రత్తలు తీసుకొని ప్రమాదాల కాకుండా చూడాలి.. సుమారు 17 వేల మంది నగర పోలీసులతో పాటు 3 వేల మంది ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని హైదరాబాద్ పోలీస్ బాస్ సీవీ ఆనంద్ చెప్పారు.