HYDRA : తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్రంలోని చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా ఈ ప్రక్రియ ద్వారా అక్రమ కబ్జాలపై బుద్ధి చూపిస్తుంది. గత కొన్ని నెలల్లో, చెరువులపై కబ్జాలు చేయడంపై కఠిన చర్యలు తీసుకోవడంతో, వందల ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని, అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. తాజాగా, నెక్నాంపూర్ చెరువులో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని నిర్ణయించారు. అయితే శుక్రవారం.. మణికొండలోని నెక్నాంపూర్ చెరువులో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ హైడ్రా అధికారులు ఆపరేషన్‌ను ప్రారంభించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు ఈ కూల్చివేతలు జరగుతున్నాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు ఈ చర్యలను చేపడుతున్నారు.
Shamshabad: కోడలిని చంపి పూడ్చేసిన అత్తామామలు.. పోలీసులు ఎలా పట్టుకున్నారంటే?
మణికొండ జాగీరులో అక్రమ నిర్మాణాలపై గురి పెట్టింది హైడ్రా. చెరువును కబ్జా చేసిన భారీ భవనాలు నిర్మిస్తున్నట్లు గుర్తించింది హైడ్రా. నెక్నాంపూర్ చెరువు బఫర్ జోన్ లో భారీ నిర్మాణాలు కొనసాగుతున్నట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. అయితే.. అక్రమ నిర్మాణాలను హైడ్రా దృష్టికి తీసుకొచ్చారు స్థానికులు.. వెంటనే స్పందించి విచారణ చేపట్టిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. అక్రమ నిర్మాణాలుగా తేలడంతో కూల్చివేతలు ఆదేశించారు. హైడ్రా కమిషనర్ ఆదేశాలతో కూల్చివేతలు చేపట్టింది DRF సిబ్బంది..
అలాగే, హైదరాబాద్‌లో ప్రత్యేకంగా హైడ్రా పోలీసు స్టేషన్ ఏర్పాటవుతోంది. బుద్ధ భవన్‌లోని బీ-బ్లాక్ కేంద్రంగా ఈ స్టేషన్ కార్యకలాపాలు సాగుతాయి. ఈ స్టేషన్‌కు ఏసీపీ స్థాయి అధికారి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఒఆర్‌ఆర్‌లోని పరిధి, అనుబంధ మున్సిపాలిటీలు కూడా ఈ స్టేషన్ పరిధిలోకి వస్తాయి. సిబ్బంది, అధికారులు డిప్యూటేషన్ ప్రాతిపదికన నియమితులవుతారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ హైడ్రా ఠాణా కార్యాలు ప్రారంభించేందుకు రంగనాథ్ తన చర్యలను సీరియస్‌గా ముందుకు తీసుకెళ్లిస్తున్నారు.
Donald Trump: నేడు హష్ మనీ కేసులో ట్రంప్‌కు కోర్టు శిక్ష విధించే ఛాన్స్..