ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల కాలంలో వరుస దెబ్బలు తగులుతున్నాయి. అయినా గుణపాఠం నేర్చుకోవడం లేదు. ఓ వైపు భద్రతా సిబ్బంది దాడులు చేస్తున్నా... మావోలు మాత్రం కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక అక్రమ తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది.. స్థానిక మైన్స్, రెవెన్యూ, పోలీస్ అధికారులపై చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది.. నందిగామలోని కంచల, పెండ్యాలలో సీనరేజ్ వసూలు చేయవద్దని చెప్పినా తవ్వకాలు జరుపుతున్నట్టు గుర్తించింది టాస్క్ ఫోర్స్..
కొందరు ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా తీవ్ర ఆరోపణలు చేశారు. కేశినేని చిన్ని ఫోన్ ను ట్యాప్ చేస్తున్నట్టు బోండా ఉమ ఆధారాలు బయట పెట్టారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురందేశ్వరి ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ప్రభుత్వంపై బోండా ఉమా అభియోగం మోపారు. సీతారామంజనేయులు నేతృత్వంలో ఫోన్లు ట్యాపింగ్ ప్రక్రియ జరుగుతోందని ఆరోపించారు. గతంలో తాము ఫోన్లు ట్యాప్ చేస్తున్నామని మంత్రులు పెద్దిరెడ్డి, గుడివాడ అమర్నాధ్…
ఈరోజు లోక్సభలోకి ఆగంతకులు చొచ్చుకునిపోయిన సంఘటన తెలిసిందే. ఇదే విషయమై సాయంత్రం ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో పోలీసు ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రొటెం స్పీకర్ ఆదేశాల మేరకు జరిగిన ఈ అత్యవసర సమావేశంలో ఆగంతుకుల దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్న ఈ తరుణంలో ఈ తరహా సంఘటనలు జరగకుండా తీసుకోవల్సిన భద్రత చర్యలపై ప్రోటెం స్పీకర్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు.
పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేసింది మద్రాస్ హైకోర్టు.. ప్రస్తుతం పోలీసు డిపార్ట్‌మెంట్‌లో 90 శాతం మంది అవినీతిపరులు ఉన్నారని.. 90 మంది అసమర్థులైన అధికారులతో పనిచేస్తున్నారని పేర్కొంది.. కనీసం కేసుల విచారణ సక్రమంగా నిర్వహించలేకపోతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.. పోలీసు శాఖలో కేవలం 10 శాతం మంది సిబ్బంది మాత్రమే నిజాయితీగా, సమర్థతతో ఉన్నారని.. అన్ని కేసుల్లోనూ విచారణ జరుపుతారని ఆ కొద్ది శాతం అధికారుల నుంచి ఆశించలేమని తేల్చి చెప్పింది.. అవినీతి అధికారులపై శాఖాపరమైన చర్యలు…
డ్రగ్స్ వ్యవహారంపై మళ్లీ ఫోకస్ పెట్టారు తెలంగాణ పోలీసులు.. ఇవాళ డ్రగ్స్ పై డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశానికి జంట నగరాల పోలీస్ కమిషనర్లతో పాటు జిల్లా ఎస్పీలు హాజరయ్యారు.. డ్రగ్స్ నియంత్రణకు 1000 మందితో ఫోర్స్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే కాగా.. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు డీజీపీ.. ఇక, సీఎంతో పోలీసులు, ఎక్సైజ్ అధికారులతో హై లెవల్…