మహాత్మా గాంధీ పై సినీ నటుడు శ్రీకాంత్ భరత్ చేసిన అనుచిత వ్యాఖ్యల పై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశాడు. సైబర్ క్రైమ్ ఏసీపీ శివ మూర్తి ని కలిసి జాతిపిత మహాత్మా గాంధీ జీ పై సోషల్ మీడియాలో సినీ నటుడు చేసిన అనుచిత వాఖ్యల పై చర్యలు తెవాకోవాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కోరారు. ఈ సందర్భంగా బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. సినీ నటుడు కొద్ది రోజులుగా గాంధీ జీ ని ఉద్దేశించి అసభ్య పోస్టులు పెడుతున్నాడు.. దేశానికి స్వాతంత్ర సాధనలో గాంధీ జీ ది ప్రత్యేక పాత్ర ఉంది.. శ్రీకాంత్ అయ్యాంగార్ అదొక హీరో ఇజం అనుకుంటున్నాడు.. మా అసోసియేషన్ నుండి నటుడు శ్రీకాంత్ ను తొలగించాలని వారిని కలిసి కోరుతాను అని తెలిపారు.
Also Read:Perni Nani: మాజీ మంత్రి పేర్నినానికి షాకిచ్చిన పోలీసులు..
తోటి నటుడు ఇలాంటి అసభ్యకర పోస్టులు చేస్తుంటే.. స్పందించాల్సిన అవసరం సినీ పెద్దలపై ఉందని గుర్తు చేశారు. చిరంజీవి, నాగార్జున, మంచు విష్ణు, అల్లు అర్జున్ స్పందించాలని కోరారు. మీ సినిమాల్లో ఇలాంటి వ్యక్తులకు అవకాశం ఇవ్వకుండా వెలెయ్యాలన్నారు.. గాంధీ జీ పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే ఎవ్వరు స్పందించలేదు.. తెలంగాణా పోలీసులు శ్రీకాంత్ అయ్యాంగార్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.. సినిమాటోగ్రాఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దిల్ రాజు దృష్టి కి కూడా తీసుకెళ్తానని తెలిపారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదని హెచ్చరించారు.